20, జూన్ 2013, గురువారం

విశ్వనాథ్ సూరి (Vishwanath Suri)

 విశ్వనాథ్ సూరి
జననం
స్వస్థలంకాళేశ్వరం
జిల్లాకరీంనగర్
రంగంవిమోచనోద్యమం, రాజకీయాలు
ప్రముఖ తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు మరియు రాజకీయనేత అయిన విశ్వనాథ్ సూరి కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో జన్మించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాదు జిల్లా చెన్నూరు కేంద్రంగా అనేక పోరాటాలు చేసిన యోధుడుగా పేరుపొందారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ తెలంగాణ ప్రజలు ఇంకనూ బానిసల వలె బ్రతుకుతూ ఎలాంటి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు లేకుండా మ్రగ్గుతూ జీవించే దారుణ పరిస్థితిని చూసి దానికి కారకుడైన నిజాంనవాబుపైనే ఉద్యమం చేపట్టారు. ఆయన ఉద్యమాలు నిజాం పాలకులను దడ పుట్టించాయి. రజాకార్ల దురంగతాల సమయంలో చెన్నూరులో ప్రస్తుతం గాంధీచౌక్‌గా పిలువబడే అంగడిబజారులో విశ్వనాథ్ సూరి మొదటిసారి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అక్కడి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. చివరికి నిజాంనవాబు సెప్టెంబరు 17, 1948న భారతప్రభుత్వానికి తలవంచడంతో సూరి లక్ష్యం నెరవేరినట్లయింది.

1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో విశ్వనాథ్ సూరి సోషలిస్ట్ పార్టీ తరఫున అప్పటి ఉమ్మడి నియోజకవర్గమైన లక్సెట్టిపల్లి-చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 1965-70 కాలంలో ఐరేళ్ళి మార్కెటింగ్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు.

విభాగాలు: కరీంనగర్ జిల్లా సమరయోధులు, కాళేశ్వరం మండలం, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక