పి.వి.నరసింహరాజు
| |
జననం | అక్టోబరు 31, 1938 |
స్వస్థలం | యండగండి (ప.గో.జిల్లా) |
పదవులు | 4 సార్లు ఎమ్మెల్యే |
నియోజకవర్గం | భీమవరం అ/ని, |
పెనుమత్స వెంకట నరసింహరాజు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. అక్టోబరు 31, 1938న ఉండి మండలం యండగండిలో జన్మించిన పి.వి.ఎన్.రాజు ప్రారంభంలో కాంట్రాక్టరుగా ఉండి, 1983లో ఎన్టీరామారావు పిలుపుతో రాజకీయాలలో చేరి అదే ఏడాది తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1985లో కూడా అదే స్థానం నుంచి రెండోసారి గెలుపొందారు. 1989లో అల్లూరి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓటమి చెందిననూ ఆ తర్వాత 1994, 1999లలో మళ్ళీ భీమవరం నుంచి తెదేపా తరఫున విజయం సాధించారు. 2004లో గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓటమి చెందిన పిదప ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మొత్తం 4 సార్లు శాసనసభకు ఎన్నికైన నరసింహరాజు జూలై 2, 2013న భీమవరంలో మరణించారు.
విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ నాయకులు, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం, ఉండి మండలం, 1938లో జన్మించినవారు, 2013లో మరణించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి