3, ఆగస్టు 2013, శనివారం

ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి (Uppunuthula Purushotham Reddy)

ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి
జననండిసెంబరు 7, 1933
స్వస్థలంఅడ్డగూడురు (నల్గొండ జిల్లా)
పదవులురాష్ట్ర మంత్రి, ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంరామన్నపేట నియోజకవర్గం
మరణంఆగస్టు 3, 2013
ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 1933, డిసెంబరు 7న నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడురులో జన్మించిన పురుషోత్తంరెడ్డి కాసుబ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1999 మరియు 2004లలో రామన్నపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు కమిటి చైర్మెన్‌గా, ఏపీఐఐసీ చైర్మెన్‌గా పనిచేశారు. సుధీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సెప్టెంబరు 2012లో వైకాపాలో చేరారు. ఆగస్టు 3, 2013న మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం:
ఉప్పునూతల నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడురులో యశోధారెడ్డి, వెంకటరెడ్డి దంపతులకు 1933, డిసెంబరు 7న జన్మించారు. ప్రాథమిక విద్య సూర్యాపేటలో, ఇంటర్ మరియు డిగ్రీ హైదరాబాదులోని వివేకవర్థని కళాశాలలో పూర్తిచేశారు. కళాశాలలో ఉన్నప్పుడే విద్యార్థిసంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

రాజకీయ ప్రస్థానం:
ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి 1958లో అడ్డగూడూరు సర్పంచిగా ఎన్నికయ్యారు. 1962లో మోత్కూరు పంచాయతి సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1963లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవి పొందారు. 1968లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1969-72 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటివనరుల శాఖ మంత్రిగా, 1974-77వరకు జలగం వెంగళరావు మంత్రివర్గంలో ఆబ్కారి, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004లో అదే స్థానం నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సెప్టెంబరు 9, 2012న వైకాపాలో చేరారు.



విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, మోత్కూరు మండలము, రాష్ట్ర మంత్రులు, రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, 1933లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక