7, సెప్టెంబర్ 2013, శనివారం

ఆలంపూర్ జోగులాంబ ఆలయం (Alampur Jogulamba Temple)

ఆలంపూర్ ఆలయ సముదాయం
అయిదవ శక్తిపీఠంగా, శ్రీశైలం పశ్చిమ ద్వారంగా భాసిల్లుతున్న ఆలంపూర్ జోగులాంబ దేవాలయం జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర తీరాన ఉన్నది. కృష్ణా, తుంగభద్రల సంగమప్రాంతం సంగమేశ్వరం సమీపంలో ఉన్న ఈ క్షేత్రం ప్రాచీనమైనది. క్రీ.శ.6, 7వ శతాబ్ది కాలంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు శాసనాధారాలున్న ఈ ఆలయ సముదాయం నవబ్రహ్మల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు నగరంగా మారిన కర్నూలు పట్టణ ఏర్పాటుకు నాంది ఆలంపూర్ క్షేత్ర నిర్మాణమే.

జోగులాంబ ఆలయం
జోగులాంబ ఆలయం అలంపురంలోని ఆగ్నేయదిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి,ముండి విగ్రహాలను భద్రపర్చి బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం కలదు. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రారంధిస్తారు.అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలొ ఉండేది. 2008లొ ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు.బాల బ్రహ్మేశ్వరాలయంలొ ఉన్నప్పుడు అమ్మవారిని కిటికి గుండా చూసేవారు.

9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది. శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.

ఆలంపూర్‌లో చాళుక్యుల
కాలం నాటి దేవాలయాలు
నవబ్రహ్మ ఆలయాలు
నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరములు పాలించారు. ఈ బాదామి చాళుక్యులు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లలో చాలా దేవాలయములు నిర్మించారు. ఇక్కడి కొన్ని శిల్పాలను దగ్గరలోని సంగ్రహాలయంలో ఉంచారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనునవి ఆ తొమ్మిది దేవాలయములు. ఇవి అన్నీ కూడా తుంగభద్రానది ఓడ్డున కలవు. వీటిలో బాల బ్రహ్మ పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనికి క్రీస్తు శకం 702కాలం నాటిదిగా గుర్తించినారు. ఇక్కడ శివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు.


విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలుఆలంపూర్ మండలము,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • పాలమూరు జిల్లా దేవాలయాలు,
 • ఆంధ్రప్రదేశ్ దర్శిని,
 • ఆంధ్రప్రదేశ్ సందర్శనీయ క్షేత్రాలు,
 • తెలంగాణ దేవాలయాలు,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక