3, సెప్టెంబర్ 2013, మంగళవారం

జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం (Jukkal Assembly Constituency)

జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ జహీరాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు కలవు.
  • జుక్కల్, 
  • పిట్లం, 
  • నిజాంసాగర్, 
  • బిచ్కుంద, 
  • మద్నూర్,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 హన్మంత్ షిండేతెలుగుదేశం పార్టీ ఎస్.సావిత్రి కాంగ్రెస్ పార్టీ
2014 హన్మంత్ షిండే తెరాస సౌదాగర్ గంగారం కాంగ్రెస్ పార్టీ
2018 హన్మంత్ షిండే తెరాస సౌదాగర్ గంగారం కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంత్ షిండే తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సావిత్రిబాయిపై 34058 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. షిండేకు 72 వేల ఓట్లు రాగా, సావిత్రికు 38 వేల ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అరుణకు 10వేల ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యే, తెరాసకు చెందిన హన్మంత్ షిండే తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారంపై 34848 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున హన్మంతు షిండే, భాజపా తరఫున అరుణతార, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారం పోటీచేశారు. తెరాసకు చెందిన హన్మంత్ షిండే తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగారాం సౌధాగర్ పై 35625 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక