29, నవంబర్ 2013, శుక్రవారం

తాడూర్ బాలాగౌడ్ (Tadur Bala Goud)

 తాడూర్ బాలాగౌడ్
జననంఅక్టోబరు 2, 1931
పదవులురాష్ట్ర మంత్రి, ఎంపి,జిల్లా పరిషత్తు చైర్మెన్‌,
నియోజకవర్గంఎల్లారెడ్డి అ/ని, నిజామాబాదు లో/ని,
మరణంమార్చి 1, 2010
తాడూర్ బాలాగౌడ్ నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. రాష్ట్ర మంత్రిగా, 2 సార్లు లోకసభ సభ్యుడిగా పనిచేసిన బాలాగౌడ్ అక్టోబరు 2, 1931న నిజామాబాదు జిల్లా లింగంపేట మండలం ఐలాపురంలో జన్మించారు. ఒక పర్యాయం శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. నిజామాబాదు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా కూడా పనిచేశారు. వెనకబడిన తరగతుల వారి అభ్యున్నతికై ఎంతో పాటుపడిన బాలాగౌడ్ మార్చి 1, 2010న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
బాలాగౌడ్ గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా రాజకీయ జీవితం ఆరంభించారు. 1978లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై టంగుటూరి అంజయ్య మరియు భవనం వెంకట్రాం మంత్రివర్గాలలో పనిచేశారు. 1983లో ఎల్లారెడ్డి నుంచే పోటీచేసి ఓడిపోయారు. 1984, 1989లలో నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 1991లో లోకసభకు పోటీచేసి పరాజయం పొందారు. నిజామాబాదు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా కూడా పనిచేశారు.

సామాజిక కార్యక్రమాలు:
వెనకబడిన తరగతుల వారి అభ్యున్నతికి బాలాగౌడ్ కృషిచేశారు. బీసి JAC కన్వీనర్‌గా, అఖిలభారత బిసి సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు..



విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, లింగంపేట మండలం, 6వ శాసనసభ సభ్యులు, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, 8వ లోకసభ సభ్యులు, 9వ లోకసభ సభ్యులు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, రాష్ట్ర మంత్రులు, 1931లో జన్మించినవారు, 2010లో మరణించినవారు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,
  • ఎన్నికల సంఘం వెబ్‌సైట్,
  • లోకసభ ఎబ్‌సైట్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక