17, నవంబర్ 2013, ఆదివారం

వలిపె రాంగోపాలరావు (Valipe Ramgopal Rao)

 వలిపె రాంగోపాలరావు
జననం
స్వస్థలంకొల్లాపూర్
రంగంశాస్త్రవేత్త
అవార్డులుశాంతిస్వరూప్ భట్నాగర్ (2005), ఇన్ఫోసిస్ అవార్డు (2013),
వలిపె రాంగోపాలరావు నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. ముంబాయి ఐఐటీలో శాస్త్రవేత్తగా రాణిస్తూ 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును, 2013లో ఇన్ఫోసిస్ అవార్డును పొందారు.

విద్యాభ్యాసం:
రాంగోపాలరావు కొల్లాపూర్ పట్టణానికి చెందిన న్యాయవాది రాఘవరావు చిన్నకుమారుడు. తండ్రి రాఘవరావు కొల్లాపూర్ సమితి చైర్మెన్‌గా పనిచేశారు.[2] రాంగోపాలరావు ఇంటర్మీడియట్ వరకు స్థానికంగా కొల్లాపూర్‌లోనే తెలుగు మాధ్యమంలో చదివారు. బీటెక్ ను మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి పూర్తిచేశారు. ఆ తర్వాత ముంబాయి ఐఐటీలో శాస్త్రవేత్తగా చేరి ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నారు.

అవార్డులు- గుర్తింపులు:
రాంగోపాలరావు కృషికి గుర్తింపుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 2013లో నానో టెక్నాలజీ విభాగంగంలో కృషికిగాను ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తిగా కీర్తి పొందారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రముఖులు, కొల్లాపూర్ మండలము, శాస్త్రవేత్తలు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక