26, డిసెంబర్ 2013, గురువారం

గణపతిదేవుడు (Ganapati Deva)

 గణపతిదేవుడు
సామ్రాజ్యముకాకతీయ సామ్రాజ్యము
పాలన కాలం1199-1262
బిరుదులురాయగజకేసరి, చోడకటకచూర,


గణపతిదేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులలో ప్రముఖుడు. కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన చక్రవర్తిగానే కాకుండా అతి విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి కాకతీయ పాలకులలో అగ్రగణ్యుడిగా గణతికెక్కాడు. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు క్రీ.శ.1199లో రెండో ప్రోలరాజు అనంతరం రాజ్యానికి వచ్చి 1262 వరకు పాలించి, తనకు పురుష సంతానం లేకుండుటచే కూతురు రుద్రమదేవిని పీఠంపై ఎక్కించాడు.

దిగ్విజయ యాత్రలు:
గణపతిదేవుడు మొట్టమొదట వెలనాటి చోళరాజైన పృథ్వీశ్వరునిపై దండెత్తినాడు. 1201లో బెజవాడను ఆక్రమించాడు. గణపతిదేవుడు నెల్లూరు, కంచి, కళింగ, వెలనాటి చోళుకను జయించి "రాయగజకేసరి" బిరుదాన్ని పొందాడు. దేవగిరి యాదవులతో మైత్రిని కొనసాగించాడు. పలు ప్రాంతాలను కాకతీయ సామ్రాజ్యంలో విలీనం చేసి దిగ్విజయ యాత్రలో ఆంధ్రదేశాన్నంతటినీ జయించి "ఆంధ్రదేశాధీశ్వర" ఖ్యాతిని పొందాడు. దివిసీమను ఆక్రమించి తిరిగి ఇచ్చివేసి దివిసీమ పాలకును కూతుళ్ళు నారమ్మ, పేరమ్మలను వివాహం చేసుకొని, బావమరిది జాయపసేనానిని "గజసాహిణి"గా నియమించుకున్నాడు. గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రుడు సమర్థవంతమైన సేనానిగా ఖ్యాతిచెందాడు. కాకతీయ రాజ్యాన్ని శత్రువుల బారినుంచి కాపాడటంలో గణపతిదేవునికి సహకరించి గణపతిదేవునిచే "కాకతీయ రాజ్యభారధౌరేయ" బిరిదాన్ని పొందాడు. గణపతిదేవుడు మనుమసిద్ధికి యుద్ధంలో సహాయపడ్డాడు. కళింగ దండయాత్ర ద్వారా కాకతీయ ప్రతిష్ట చేకూరిననూ శాశ్వత లాభాలు కల్గలేదు. ముత్తుకూరు యుద్ధంలో జటావర్మ సుందరపాండ్యుని చేతిలో గణపతిదేవుడు ఓడిపోయాడు. 1263లో జరిగిన ముత్తుకూరు యుద్ధంలో తప్ప గణపతిదేవుడు ఏ యుద్ధంలోనూ ఓటమి చెందలేదు.

నిర్మాణాలు:
రుద్రదేవుని కాలంలో ప్రారంభమైన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని గణపతిదేవుడు పూర్తిచేశాడు. స్వయంభూదేవాలయానికి నాగులువైపులా కాకతీయ తోరణాలు నిర్మింపజేశాడు. రామప్ప దేవాలయం ఇతని కాలంలోనే రేచర్ల రుద్రుడు నిర్మించాడు. పిల్లలమర్రి, నాగులపాడు, పానగల్లులలో ఆలయాలు కూడా గణపతి దేవుని కాలంలోనే నిర్మితమైనాయి. మోటుపల్లిలో విదేశీవర్తకాన్ని ప్రోత్సహించడానికి అభయశాసనాన్ని వేయించాడు.

మతవిధానం:
గణపతిదేవుడు శైవభక్తుడు. ఇతని గురువు విశ్వేశ్వర శివచార్యుడు. విశ్వేశ్వరుడు 36 జైన గ్రామాలను ధ్వసం చేసినట్లు సిద్ధేశ్వర చరిత్ర గ్రంథం తెలుపుతుంది. ఇతను పలు గోళకీమఠాలను స్థాపించాడు.



విభాగాలు: కాకతీయ చక్రవర్తులు, 13వ శతాబ్దము, కాకతీయ సామ్రాజ్యము


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలంగాణ చరిత్ర (రచన: సుంకిరెడ్డి నారాయణరెడ్డి),
  • ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర (రచన:ఏటుకూరి బలరామమూర్తి),
  • మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వము (రచన: బి.ఎన్.శాస్త్రి),
  • కాకతీయ చరిత్రము (రచన: తేరాల సత్యనారాయణ),

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక