2, డిసెంబర్ 2013, సోమవారం

కానుకుర్తి (Kankurthy)

 కానుకుర్తి గ్రామము
గ్రామముకానుకుర్తి 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా3461 (2001)
4280 (2011)
కానుకుర్తి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామము కర్ణాటక సరిహద్దులో కలదు. ఇక్కడికి దగ్గరిలోనే కర్ణాటక లోని యానగుంది మాణిక్యేశ్వరిమాత పుణ్యక్షేత్రం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3461. ఇందులో పురుషులు 1696, మహిళలు 1765. గృహాల సంఖ్య 717.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4280. ఇందులో పురుషులు 2091, మహిళలు 2189. గృహాల సంఖ్య 785. అక్షరాస్యత శాతం 46.61%. గ్రామ కోడ్ సంఖ్య 575003.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం జిల్లా కేంద్రం మండల కేంద్రం దామరగిద్ద నుంచి కర్ణాటకలో జాతీయ రహదారిపై ఉన్న మాణికేశ్వరి ఆలయం వెళ్ళు మార్గంలో ఉంది.

రాజకీయాలు:

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా రాజమణి ఎన్నికైనది.

విద్యాసంస్థలు:
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, 2 మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

ఎంపిటీసి నియోజకవర్గం:
మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.చిన్నకిష్టప్ప తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.కాశీనాథ్ విజయం సాధించాడు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 1727 కాగా చిన్నకిష్టప్పకు 850 ఓట్లు, కాశీనాథ్‌కు 806 ఓట్లు వచ్చాయి.



విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక