కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గంలో 2 మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 2 మండలాలు కలవు.
2004 ఎన్నికలు: 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై 27772 ఓట్ల ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ అభ్యర్థికి 76333 ఓట్ల రాగా, తెలుగుదేశం అభ్యర్థి 48561 ఓట్లు పొందినారు.
2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీచేసిన సి.పి.ఐ. అభ్యర్థి, పార్టీ జిల్లా కార్యదర్శి కూనం సాంబశివరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై 2229 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన జలగం వెంకట్రావ్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కె.సత్యనారాయణపై 22480 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున జలగం వెంకటరావు, భాజపా తరఫున బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన వనమా వెంకటేశ్వరరావు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వనమా వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన జలగం వెంకటరావు పై 4139 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
19, డిసెంబర్ 2013, గురువారం
కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం (Kothagudem Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి