7, డిసెంబర్ 2013, శనివారం

పద్మనాభం (Padmanabham)

  పద్మనాభం 
(1931-2010)
జననంఆగస్టు 20, 1931
స్వస్థలంసింహాద్రిపురం (కడప జిల్లా)
రంగంతెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు,
మరణంఫిబ్రవరి 20, 2010
పద్మనాభం ఆగస్టు 20, 1931న కడప జిల్లా సింహాద్రిపురం మండల కేంద్రంలో జన్మించారు. తెలుగు సినిమా హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం రంగస్థలనటుడిగా, సినీనిర్మాతగా, దర్శకుడిగానూ పేరుపొందారు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవారు. ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు..

ఐదేళ్ళ వయసులో (1936లో) "చింతామణి" నాటకంలో కృష్ణుడివేషం వేసి ఒక వెండికప్పు బహుమతిగా పొందారు. థియేటర్ మేనేజర్ ను మంచిచేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాడు. మద్రాసు వెళ్ళి నటి కన్నాంబకు విషయం మొత్తం చెప్పేశారు. తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరీ వారి కంపెనీలో కుదురుకున్నారు. వాళ్ళు తీసిన "పాదుకాపట్టాభిషేకం" సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం మాయలోకం సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రాధిక(1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. షావుకారులో నౌకరు పోలయ్య వేషానికి పిలిపించి వేషం ఇప్పించారు.

1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీ రామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు. ఏదో మోసం జరిగి తాను తీసిన చిత్రాలపై తనకు హక్కు లేకుండా పోయింది. దీంతో ఆయన మతి భ్రమించింది. చికిత్స పొంది తేరుకున్నా ఆర్థిక ఇబ్బందులు మాత్రం వచ్చాయి. చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఫిబ్రవరి 20, 2010న మరణించారు.

విభాగాలు: తెలుగు సినిమా నటులు, తెలుగు సినిమా దర్శకులు, తెలుగు సినిమా నిర్మాతలు, కడప జిల్లా ప్రముఖులు, సింహాద్రిపురం మండలం, 1931లో జన్మించినవారు, 2010లో మరణించినవారు,


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక