23, డిసెంబర్ 2013, సోమవారం

పాలగిరి రామకృష్ణారెడ్డి (Palagiri Ramakrishna Reddy)

పాలగిరి రామకృష్ణారెడ్డి
జననంజూలై 1, 1955
ప్రాంతంగిద్దలూరు (ప్రకాశం జిల్లా)
రంగంఆయిల్ టెక్నాలజి
తైలరంగంలో నిపుణుడైన పాలగిరి రామకృష్ణారెడ్డి జూలై 1, 1955న ప్రకాశం జిల్లా గిద్దలూరులో జన్మించారు. 1975లో ఆదోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఆయిల్ టెక్నాలజీలో బిఎస్సీ పట్టాను, తర్వాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఆయిల్ టెక్నాలజీలో డిప్లొమా పొందారు. పలు భాషలలో పరిజ్ఞానమున్న పాలగిరి తెలుగు, ఆంగ్ల, కన్నడ భాషలలో ఆయిల్ టెక్నాలజీపై పలు వ్యాసాలు రచించారు.

తైలరంగంలో అనుభవం:
పాలగిరి 1980 దశకం నుంచి నూనె గింజలు నుండి వివిధ రకాల నూనెలను తీయడంలో నిపుణత సాధించారు. నూనెలను విశ్లేషణ చేయడం, నూనె గింజలను శుద్ధి చేసి వంటనూనెలను ఉత్పత్తి చెయ్యడం. నూనెలను రిఫైనరిలో రిఫైన్‌ చేసి రిఫైండ్ అయిల్స్ ఉత్పత్తి చెయ్యడంలో అపార అనుభవం సాధించారు. అంతేకాకుండా నూనె తీయు యంత్రాలను, పరికరాలను డిజైన్ చేయడం, అయిల్ ప్రాసెసింగ్ లో వచ్చు సమస్యలను సరిదిద్దటం, అయిల్ ప్రాసెసింగ్‌ లో కలిగే ఖర్చులను తగ్గించడంతో నష్టాలు రాకుండా నిరోధించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడంలో మంచి పరిణతి సాధించారు.

రచనలు:
పాలగిరి ఆయిల్ పరిశ్రమలో కేవలం నిపుణత సాధించడమే కాకుండా ఆయిల్ పరిశ్రమలోని నైపుణ్యాలను ఇతరులకు చేరవేయడానికి ముఖ్యంగా నూనె పరిశ్రమలో పనిచేస్తూ ఆంగ్ల పరిజ్ఞానంలేనివారికై తెలుగులో నూనె శుద్ధికి సంబంధించిన  అంశాలపై పలు వ్యాసాలు రచించారు. తెలుగు వికీపీడియా (స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వము)లో కూడా నూనెలకు సంబంధించి విలువైన వ్యాసాలు రచించి ఆ రంగంలోని వ్యాస సమాచరాన్ని పరిపుష్టి చేశారు. పాలగిరి తెలుగుతో పాటు కన్నడ, ఆంగ్ల వికీపీడియాలలో కూడా రచనలు చేస్తున్నారు.



విభాగాలు: ప్రకాశం జిల్లా వ్యక్తులు, గిద్దలూరు మండలము, 1955లో జన్మించినవారు, ఆయిల్ టెక్నాలజీ నిపుణులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక