1, జనవరి 2014, బుధవారం

అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (Ashwaraopet Assembly Constituency)

అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఖమ్మం జిల్లాకు చెందిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు కలవు.
  • అశ్వారావుపేట, 
  • దమ్మపేట, 
  • ములకలపల్లి, 
  • చంద్రుగొండ, 
  • వేలేరుపాడు, 
  • కుక్కునూరు,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఒగ్గెల మిత్రసేన కాంగ్రెస్ పార్టీ పి.వెంకయ్య సి.పి.ఎం.
2014 టి.వెంకటేశ్వర్లు వైకాపా మెచ్చా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2018 ఎం.నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టి.వెంకటేశ్వర్లు తెరాస



2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిత్రసేన తన సమీప ప్రత్యర్థి, మహాకూటమి తరఫున పోటీచేసిన సిపీఎం అభ్యర్థి పి.వెంకయ్యపై 5107 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.వెంకటేశ్వర్లు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టికి చెందిన ఎం.నాగేశ్వరరావుపై 830 ఓట్ల స్వల్ప మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున తాటి వెంకటేశ్వర్లు, భాజపా తరఫున భూక్యా ప్రసాదరావు, ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన మచ్చా నాగేశ్వరరావు పోటీచేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన తాటి వెంకటేశ్వర్లు పై 13117 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం లోకసభ నియోజకవర్గం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక