10, జనవరి 2014, శుక్రవారం

బెలూం గుహలు (Belum Caves)

బెలూం గుహలు
మండలంకొలిమిగుండ్ల
జిల్లాకర్నూలు జిల్లా
ప్రత్యేకతరాష్ట్రంలోనే పొడవైన గుహలు
బెలూం గుహలు సహజసిద్ధంగా ఏర్పడిన అతిపొడవైన గుహలు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామసమీపంలో ఉన్న ఈ గుహలు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్నది. లక్షలాది సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఏర్పడిన ఈ గుహలను వెలుగులోకి తెచ్చిన ఘనత 1884లో రాబర్ట్ బ్రూస్‌ఫుట్‌కు దక్కుతుంది. 1989లో దీనిని ఆంధ్రప్రదేశ్ పురావస్తుశాఖ తమ అధీనంలోకి తీసుకోగా, 2000లో పర్యాటక శాఖ చేతుల్లోకి వెళ్ళింది. 2003లో ఈ గుహలను ప్రజలకు అంకితం చేశారు. వీటివల్ల సందర్శకులు చూడటానికి వీలవుతున్నది.

దాదాపు 3300 మీటర్లు పొడువున్న ఈ గుహలు భారత ఉపఖండంలోనే రెండో పొడవైన గుహలుగా ఖ్యాతిచెందాయి. బెలుంగుహలకు 3 ముఖద్వారాలున్నాయి. లోపల వెళ్ళడానికి 100 మీతర్ల విశాలమైన వెడల్పు నుంచి కేవలం మనిషి పట్టేంత వెడల్పు వరకు ఉంది. గుహ లోపలిభాగంలో పైన మరియు క్రింద సున్నపురాతి కరగడంతో ఏర్పడిన స్టాలగ్‌టైట్, స్టాలగ్‌మైట్‌లు రకరకాల అకారాలతో పర్యాటకులను పరవశం చేస్తాయి. గుహలోపల చూడదగిన అనేక ప్రదేశాలున్నాయి. వెయ్యిపడగలు, ధ్యానమందిరం, ఊడలమర్రి, మాయామందిర్. కోటిలింగాలు తదితరాల కాకుండా గుహల ఆవరణంలో పర్యాటక శాక ఏర్పాటుచేసిన 60 అడుగుల పెద్ద బుద్ధవిగ్రహం కూడా ఉంది.

విభాగాలు: కర్నూలు జిల్లా పర్యాటక ప్రాంతాలు, కొలిమిగుండ్ల మండలం, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  • ఆంగ్ల వికీపీడియా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక