9, జనవరి 2014, గురువారం

చంద్రగఢ్ కోట (Chandragadh Fort)

చంద్రగఢ్ కోట
గ్రామముచంద్రగఢ్ 
మండలమునర్వ
జిల్లామహబూబ్‌నగర్
నిర్మించిన కాలం18 వ శతాబ్ధి
చంద్రగఢ్ కోట మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలంలోని చంద్రగడ్ గ్రామం సమీపంలో ఉంది. ఎత్తయిన కొండపై నిర్మించబడి గిరిదుర్గంగా ప్రసిద్ధి చెందిన ఈ కోట మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో నిర్మించబడినట్లు చరిత్ర తెలుపుతుంది. ఈ కోట గద్వాలకు 20 కిమీ దూరంలో, ఆత్మకూరుకు 12 కిమీ దూరంలో, జూరాల ప్రాజెక్టుకు 5 కిమీ దూరంలోనూ ఉంది.

నిర్మాణం:
చంద్రగఢ్ గ్రామానికి గ్రామానికి ఉత్తరదిశలో ఎత్తైన కొండపై ఈ కోటను రెండు అంచెలుగా నిర్మించారు. పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ కోట కనిపిస్తుంది. ఈ కోట మొత్తం నిర్మాణమంతా రాతితోనే జరిగింది. కాబట్టి ఈ నాటికి చెక్కుచెదరకుండా చూపరులను ఆకట్టుకుంటోంది. 18 వ శతాబ్ధిలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానములో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించినట్లు తెలుస్తుంది. కొండపై మొదటి భాగంలో విశాలమైన ఆవరణాన్ని చుట్టి రక్షణగోడ ఉంది. దానిని దాటి మరింత పైకి వెళ్తే, మరింత ఎత్తులో అద్భుత నిర్మాణంతో కూడిన రాతికోట కనిపిస్తుంది. దీనికి పశ్చిమాన మరియు ఉత్తరాన రెండు ద్వారాలు ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ ద్వారా మాత్రమే పర్యాటకులు వెళ్ళడానికి అవకాశం ఉంది.

ఆలయం:
కోట లోపల శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆలయం చుట్టూ 8 ఊట బావులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ స్వచ్ఛమైన నీటి ఊటతో తాగునీరును అందిస్తున్నాయి. శ్రీరామలింగేశ్వరస్వామికి ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు కొండపై జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తుంటారు.విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా కోటలు, నర్వ మండలము, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • తెలుగు వికీపీడియా,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక