22, జనవరి 2014, బుధవారం

కె.కేశవరావు (K.Keshav Rao)

కె.కేశవరావు
జననంజూన్ 4, 1939
పదవులుపిసిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి,
కె.కేశవరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. జూన్ 4, 1939న వరంగల్ జిల్లా కాజీపేటలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., పీహెచ్‌డి అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడే విద్యార్థి నాయకుడిగా వ్యవహరించి వైస్-ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. కె.కేశవరావు పిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
1979-85 వరకు విధానమండలి సభ్యులుగా ఉండి, 1979-80లో విధానమండలి డిప్యూటి చైర్మెన్‌గా వ్యవహరించారు. 1980-83 కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రుల కాలంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు.  2006 ఏప్రిల్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2013 మేలో తెరాసలో చేరి ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పదవి పొందారు. 2014 జనవరిలో తెరాస తరఫున రాజ్యసభకు పోటీచేసి ఎన్నికైనారు. జూన్ 3, 2014న కేశవరావు తెరాస పార్లమెంటరీ పార్టీ నేతగా నియమితులైనారు.

ఈయన పలు పుస్తకాలు రచించారు. 1979లో జాతీయస్థాయి అవార్డు పొందిన "నిమజ్జనం" తెలుగు సినిమాకు స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా రాజకీయ నాయకులు, పిసిసి అధ్యక్షులు, 1939లో జన్మించినవారు, రాజ్యసభ సభ్యులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక