2, జనవరి 2014, గురువారం

ఉల్పర (Ulpara)

 ఉల్పర గ్రామము
గ్రామముఉల్పర 
మండలమువంగూరు 
జిల్లానాగర్‌కర్నూల్ జిల్లా
జనాభా1331 (2001)
1505 (2011)
ఉల్పర నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ సరిహద్దు నుంచి దుంధుభి ప్రవహిస్తోంది. ఊరి చివరన శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ గ్రామం అచ్చంపేట పట్టణానికి 15 కిలోమీటర్లు దూరంలో ఉంది. బస్సు సౌకర్యం చక్కగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1331. ఇందులో పురుషులు 645, మహిళలు 686. గృహాల సంఖ్య 284.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1505. ఇందులో పురుషులు 761, మహిళలు 744. గృహాల సంఖ్య 345. అక్షరాస్యత శాతం 38.94%. గ్రామ కోడ్ సంఖ్య 575612.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మారాం లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: వంగూరు మండలంలోని గ్రామాలు


 = = = = =

3 కామెంట్‌లు:

  1. గోపాల్ రావు19 ఏప్రిల్, 2014 9:55 AMకి

    అందమైన ప్రకృతికి విశాలమైన సంపదకు చిరునామ ఉల్పర. ఉల్పర గ్రామం సరిహద్దు నుంచి కృష్ణా నది ఉపనది దుంధుభి ప్రవహిస్తోంది.ఊరి చివరన అధ్భుతమైన శివాలయం,ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి.అంతేగాక ఆలయంలో ధ్వజస్థంభం గూడా ఉంది.ఈ గ్రామం అచ్చంపేట పట్టణానికి 15 కిలోమీటర్లు,శ్రీశైలం క్షేత్రానికి 115 ,ఉమామహేశ్వర క్షేత్రానికి 30,నాగర్ కర్నూల్ పట్టణానికి 30,కల్వకుర్తి పట్టణానికి 20,డిండి రిజర్వాయర్ కు 20, హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు సౌకర్యం మెండుగా ఉన్న గ్రామాల్లో ఇదొకటి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గ్రామ సమాచారం అందించిన గోపాలరావు గారికి కృతజ్ఞతలు. కొంత సమాచారం వ్యాసంలో చేర్చాను. మరిని గ్రామాల సమాచారం కూడ అందించగలరని కోరుచున్నాను.

      తొలగించండి

  2. ఉల్పర.... మహబూబ్ నగర్ జిల్లా, వంగూరు మండలానికి చెందిన గ్రామము. ఉల్పర గ్రామ సరిహద్దుల నుంచి కృష్ణా నది ఉపనది అయిన దుందుభీ నది ప్రవహిస్తుంది. గ్రామం చివరన శివాలయంతో పాటు నాటి రాజులు నిర్మించిన కోనేరు ఉంది. ఉల్పర గ్రామం మధ్యలో రాళ్లతో నిర్మించిన బుర్జు నెలవై ఉంది. కల్వకుర్తి నియోజక వర్గానికి 20 కిలో మీటర్ల దూరంలో,నాగర్ కర్నూల్ నియోజక వర్గానికి 35 కిలోమీటర్లు, అచ్చంపేట నియోజక వర్గానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉల్పర గ్రామం. గ్రామంలో విద్యావంతులకు కొదవలేదు.

    ఉల్పర సరిహద్దులు – పోతిరెడ్డిపల్లి, మిట్టసదగోడు,మొల్గర, చింతపల్లి, కోనాపూర్‌

    గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇక్కడి ప్రధాన పంటలు వరి, ఆముదాలు, వేరుశనగ, ప్రత్తి, మొక్కజొన్న


    గ్రామంలోని ప్రధాన ఆలయాలు: ఆంజనేయస్వామిదేవాలయం, ఊరి చివరనున్న శివాలయం పేర్గాంచినవి.

    గ్రామ ప్రత్యేకతలు

    ఉల్పర ప్రత్యేకతలు – 3 పట్టణాలకు మధ్యలో ఉంటుంది. ప్రత్యేకించి దాదాపు 60 శాతం మందికి డ్రైవింగ్‌ నేర్చిన వారు అధికం.ఎ వరినైనా ఆదరించగల మమకారం ఉల్పర సొంతం. ఆప్యాయతానురాగాలతో అందరిని పలకరిస్తుంది.

    గ్రామ ప్రముఖులు

    ఊరిలో ప్రముఖ వ్యక్తులు – పెంటమరాజు రంగారావు గారు. ఈయన గ్రామపరిపాలనాధికారిగా (వీఏవో) 30 యేళ్లు విధులు నిర్వర్తించి ఉల్పర గ్రామానికి మంచి పేరు తెచ్చిపెట్టారు. ఎంతో మందికి వ్యవసాయ భూములు ఉచితంగా దానం చేశారు. ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా కేటాయించారు.

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక