10, మార్చి 2014, సోమవారం

జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy)

 జి.కిషన్ రెడ్డి
జననంమే15, 1964
స్వస్థలంతిమ్మాపురం (రంగారెడ్డి జిల్లా)
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు, ప్రస్తుతం ఎంపి & కేంద్రమంత్రి


జి.కిషన్ రెడ్డి  భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత మరియు రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 2009, 2014లలో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వరుసగా ఎన్నికైనారు. 2019 శాసనసభ ఎన్నికలలో మరోసారి అంబర్‌పేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాదు స్థానం నుంచి విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మే 30, 2019న కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

వ్యక్తిగత జీవితం:
1964, మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలొ కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).

రాజకీయ ప్రస్థానం:
1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భాజపా తరఫున తన సేవలు అందిస్తున్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందినారు. 2001లో భాజపా రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందినారు. 2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. శాసనసభలో భాజపా పక్షనాయకుడిగా కూడా వ్యవహరించారు. 2010, మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించారు. 2014లో మరోసారి అంబర్‌పేట్ నుంచి విజయం సాధించి మూడవసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019 శాసనసభ ఎన్నికలలో మరోసారి అంబర్‌పేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాదు స్థానం నుంచి విజయం సాధించి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మే 30, 2019న కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

(గమనిక: ఈ సమాచారం 30-05-2019 నాటికి తాజాకరించబడింది)

విభాగాలు: రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులుహైదరాబాదు రాజకీయ నాయకులు, హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం, 12వ శాసనసభ సభ్యులు, 13వ శాసనసభ సభ్యులు, 1964లో జన్మించినవారు, 17వ లోక్‌సభ సభ్యులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక