23, మార్చి 2014, ఆదివారం

కొల్లాపూర్ (Kollapur)

కొల్లాపూర్ గ్రామము
పట్టణము కొల్లాపూర్ 
మండలముకొల్లాపూర్ 
జిల్లానాగర్‌కర్నూల్
జనాభాxxxx (2001)
xxxx (2011)
కొల్లాపూర్ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. గ్రామ విస్తీర్ణం 1151 హెక్టార్లు. ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉన్న పట్టణం 2012లో నగరపంచాయతీగా ఏర్పడింది. సంస్థానాధీశుల కాలంలో కొల్లాపూర్ కేంద్రంగా అనేక శతాబ్దాల పాటు సురభి రాజులు పాలించారు. పట్టణానికి సమీపంలో ఉన్న పలు ప్రాంతాలు కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. సంస్థానాధీశులు నిర్మించిన ఆలయాలు, కట్టడాలు, సమీపంలోనే కృష్ణానది, నల్లమల అటవీ ప్రాంతం ఉన్నాయి. సంస్థానాధీశుల కాలంలోనే కొల్లాపూర్‌లో విమానాశ్రయం ఉండేది. పట్టణానికి నీటిసరఫరా కోసం కృష్ణానది తీరాన సోమశిల వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మించారు.

సురభి రాజుల పరిపాలనలో మైసూర్‌ నగరం ప్లాన్‌ మేరకు అక్కడి మాదిరిగానే ఇక్కడ విశాలమైన రోడ్లు, రోడ్డుకిరువైపులా లోతైన చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, పరిపాలనకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలను సురభిరాజులే నిర్మించారు. ప్రముఖ కవి వాజపాయ యాజుల రామసుబ్బరాట్కవి ఈ పట్టణమునకు చెందినవారు.

చరిత్ర:

కొల్లాపూర్‌ను కేంద్రంగా చేసుకొని సురభి రాజులు పాలన సాగించారు. ఆ కాలంలో సంస్థానాధీశులు నిర్మించిన అనేక కట్టడాలు పట్టణంలో కనిపిస్తాయి. 1952లో అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడింది. 1956లో పురపాలక సంఘంగా ఏర్పడి 1964లో మేజర్ గ్రామపంచాయతీగా మార్చబడింది. 2012లో మళ్ళీ హోదా పెంచబడి నగర పంచాయతీగా చేశారు. నగరపంచాయతిగా హోదాపెంచబడిన తర్వాత పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల వేగం పుంజుకుంది. ముఖ్యంగా పట్టణ ప్రధాన రహదారులన్నీ సిసి రోడ్లతో నిర్మించారు.


విభాగాలు: కొల్లాపూర్ మండలంలోని గ్రామాలు, కొల్లాపూర్ మండలం,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక