మహబూబ్‌నగర్ జిల్లాలోనే మొట్టమొదటి పురపాలక సంఘంగా అవతరించిన నారాయణపేట పురపాలక సంఘము తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత రెండవ పురాతన పురపాలక సంఘంగా ఘనతకెక్కింది. 1947లో అవతరించిన ఈ పురపాలక సంఘానికి సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన రాంచందర్ రావు కళ్యాణి తొలి చైర్మెన్ గా వ్యవహరించగా ఇప్పటివరకు 10 గురు ఈ విధులను నిర్వహించారు. ప్రస్తుతం ఇది మూడవశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 33 వార్డులు, 48825 ఓటర్లు కలరు. 2014 మార్చి 30న జరగబోయే ఎన్నికలకై చైర్మెన్ స్థానాన్ని బీసి (మహిళ)కు కేటాయించారు.
ఈ పురపాలక సంఘం పరిధి 11.87 చకిమీ. 2001 ప్రకారం జనాభా 37,563 ఉండగా, 2011 నాటికి 41,539కు పెరిగింది. 2010-11 నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం 19.5, వ్యయము 19.27 కోట్ల రూపాయలు. సదుపాయాలు: పురపాలక సంఘం పరిధిలో సుమారు 3400 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 67 కిమీ పొడవైన రహదారులు, 71 కిమీపొడవైన మురికి కాల్వలు, ఒక పార్కు, ఒక మార్కెట్, ఒక వధశాల, 11 కమ్యూనిటి భవనాలు ఉన్నాయి. ఆదాయ వనరులు: పురపాలక సంఘానికి ఇంటిపన్ను, నీటిపన్ను, అనుమతి ఫీజు ప్రధాన ఆదాయవనరులు. పురపాలక సంఘం నిర్మించిన 98 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయము మరియు ప్రభుత్వం నుంచి వచ్చే పలు గ్రాంటుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2005 ఎన్నికలు: 2005లో నిర్వహించిన పురపాలక సంఘం ఎన్నికలలో చైర్-పర్సన్‌గా వై.శశికళ, వైస్-చైర్‌పర్సన్‌గా శిల్లా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలు: 2014 పురపాలక సంఘం ఎన్నికలు మార్చి 30న జరుగగా మే 12న ఓట్ల లెక్కింపు జరిగింది. భారతీయ జనతా పార్టీ అత్యధిక వార్డులలో విజయం సాధించింది.
|
4, మార్చి 2014, మంగళవారం
నారాయణపేట పురపాలక సంఘము (Narayanapet Mucipality)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి