4, ఏప్రిల్ 2014, శుక్రవారం

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం (Parakala Assembly Constituency)

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
 • పరకాల, 
 • ఆత్మకూరు, 
 • గీసుకొండ, 
 • సంగెం.
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ భిక్షపతి తెరాస
2012* భిక్షపతి తెరాస కొండా సురేఖ వైకాప
2014 చల్ల ధర్మారెడ్డి తెలుగుదేశం పార్టీ సహోదర్ రెడ్డి తెరాస

2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అయిన భిక్షపతిపై 12800 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి వైఎస్సార్ మంత్రి వర్గంలో స్థానం కూడా పొందినారు. వైఎస్సార్ మరణానంతరం మారిన రాజకీయ పరిణామాలతో మంత్రిపదవిని, కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్సార్ పార్టీలో చేరారు. శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికలలో వైకాపా తరఫున పోటీచేసి ఓడిపోయారు.

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో తెరాస తరఫున పోటీచేసిన మొలుగూరి భిక్షపతి తన సమీప ప్రత్యర్థి వైకాపా పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై 1562 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 187222 ఓట్లలో 157167 పోల్ కాగా అందులో తెరాసకు 51936 ఓట్లు, వైకాపాకు 50374 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 30850 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. భాజాపా, కాంగ్రెస్ పార్ట్లకు 4, 5 స్థానాలు దక్కాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన చల్ల ధర్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన సహోదర్ రెడ్డిపై 9225 ఓట్ల ఆధికతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, పరకాల అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక