27, మే 2014, మంగళవారం

చరణ్ సింగ్ (Charan Singh)

చరణ్ సింగ్
జననండిసెంబరు 23,1902
రాష్ట్రంఉత్తరప్రదేశ్
పదవులుఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి,
మరణంమే 29, 1987
చౌధరీ చరణ్ సింగ్ డిసెంబరు 23,1902న ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్ లో జన్మించారు. 1923లో సైన్సులో డిగ్రీపట్టా పుచ్చుకొని 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. న్యాయవిద్య కూడా అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1929లో మీరట్ కి చేరి ఆ తర్వాత కాంగ్రేసు పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ఐదవ ప్రధానమంత్రిగా పనిచేశారు. రైతుబాంధవుడిగా పేరుపొందిన చరణ్ సింగ్ మే 29, 1987న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1937లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఛత్రౌలి నుండి ఎన్నికై ఆ నియోజక వర్గానికి 1946, 1952, 1962 మరియు 1967 లలో ప్రాతినిధ్యం వహించారు. 1946లో గోవింద వల్లభ్ పంత్ మంత్రివర్గములో వివిధ శాఖలలో పనిచేశారు. 1951 జూన్ లో రాష్ట్రములో కేబినెట్ మంత్రిగా నియమితుడై న్యాయ మరియు సమాచార శాఖ మంత్రిగా ఆ తరువాత 1952లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గములో రెవిన్యూ మరియు వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు. 1959 ఏప్రిల్ లో మంత్రి పదవికి రాజీనామా చేశారు.

చరణ్‌సింగ్ 1960లో హోమ్ మరియు వ్యవసాయశాఖ మంత్రిగా, 1962-63లో వ్యవసాయ మరియు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1965లో వ్యవసాయ శాఖను విడిచి 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ చీలిక తర్వాత, 1970 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 1970 అక్టోబర్ 2 న ఈయన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రములో రాష్ట్రపతి పాలన విధించబడినది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరణ్‌సింగ్ భూసంస్కరణలు చేపట్టారు. 1960 లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకునివచ్చారు.

ప్రధానమంత్రిగా:
1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్ సింగ్ భారతదేశ 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి కంటే ముందు ఈయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలములో లోక్‌సభ సమావేశం కాలేదు. లోక్ సభ సమావేశం ప్రారంభమవుతుందనగా, ముందురోజు ఈయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రేసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్‌దళ్ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్ సింగ్ పదవికి రాజీనామా చేశారు. 6 నెలల అనంతరం లోక్‌సభకు మళ్ళీ ఎన్నికలు జరిగాయి. రైతు బంధుగా పేరుతెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు.

విభాగాలు: భారతదేశ ప్రధానమంత్రులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, 1902లో జన్మించినవారు, 1987లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక