4, మే 2014, ఆదివారం

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (Payakarao pet Assembly Constituency)

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్టణం జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 152. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • కోటవురట్ల, 
  • నక్కపల్లి, 
  • పాయకరావుపేట, 
  • ఎస్.రాయవరం,


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 గొల్ల బాబూరావు కాంగ్రెస్ పార్టీ చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీ
2012* గొల్ల బాబూరావు వైఎస్సార్ కాంగ్రెస్ చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీ
2014 వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ చెంగల వెంకట్రావు వైఎస్సార్ కాంగ్రెస్
2019




2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన చెంగల వెంకట్రావుపై 656 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2012 ఉప ఎన్నికలు:
2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి తరఫున పోటీచేసిన గొల్ల బాబూరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 14362 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 202953 ఓటర్లలో 171815 పోల్ కాగా అందులో వైకాపాకు 71963 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 57601 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 33867 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన వంగలపూడి అనిత తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెంగల వెంకట్రావుపై 2819 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.


విభాగాలు: విశాఖపట్టణం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి లోకసభ నియోజకవర్గం, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక