18, జూన్ 2014, బుధవారం

ఆల్ఫ్రెడ్ మార్షల్ (Alfred Marshall)

ఆల్ఫ్రెడ్ మార్షల్
జననం1842
దేశంఇంగ్లాండు
రంగంఆర్థికవేత్త
మరణం1924
19 వ శతాబ్దపు ఆర్థికవేత్తలలో ప్రసిద్ధుడైన ఆల్ఫ్రెడ్ మార్షల్ 1842 లో ఇంగ్లాండులోని లండన్ లో జన్మించాడు. సెయింట్ జాన్స్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. ప్రారంభంలో తత్వశాస్త్రం పై మక్కువ ఉన్ననూ తర్వాత రాజకీయ అర్థశాస్త్రం వైపు మళ్ళినాడు. 1875 లో టారిఫ్ నియంత్రణ ప్రభావాలను అద్యయనం చేయడానికి అమెరికా వెళ్ళినాడు. ఆ తర్వాత ఒక సంవత్సరం ఇటలీ లో గడిపినాడు. 1882 లో బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా చేరినాడు. 1883 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బాలియోట్ కళాశాల లో బోధించాడు. ఆ తర్వాత 1888 నుంచి 1908 వరకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాజకీయ అర్థశాస్త్రం ఉపన్యాసకుడిగా పనిచేశాడు. ఆ కాలంలో ఇంగ్లాండు లోని ఆర్థికవేత్తలలో అతనే ప్రసిద్ధుడు. ఉపాంత వినియోగం , సప్లై డిమాండు, ఉత్పత్తి వ్యయాలు అంశాలపై అతను గణనీయమైన పరిశోధనలు చేసినాడు. అర్థశాస్త్రం లో అతని యొక్క ప్రముఖ రచనలు Priciples of Economics, Industry and Trade. ఆర్థశాస్త్రంలో అనేక పరిశోధనలు చేసిన మార్షల్ 1924 లో మరణించాడు.

విభాగాలు: ఆర్థికవేత్తలు, ఇంగ్లాండు ప్రముఖులు, 1842లో జన్మించినవారు, 1924లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక