8, జూన్ 2014, ఆదివారం

రాఫెల్ నాదల్ (Rafael Nadal)

రాఫెల్ నాదల్
జననంజూన్ 3, 1986
దేశంస్పెయిన్
క్రీడటెన్నిస్
టైటిళ్ళు14 గ్రాండ్‌స్లాం సింగిల్స్, ఒక ఒలింపిక్ స్వర్ణం,
టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని అలంకరించిన రాఫెల్ నాదల్ జూన్ 3, 1986న స్పెయిన్ దేశంలో జన్మించాడు. తన కెరీర్‌లో 14 సింగిల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను, ఒక ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని, 8 డబుల్స్ గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించాడు. 2014లో ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ను 9వ సారి సాధించి ఒకే గ్రాండ్‌స్లాం ను అత్యధిక సార్లు చేజిక్కించుకున్న రికార్డును సృషించాడు. 2008లో తొలిసారి నెంబర్ వన్ స్థానం పొందాడు.

క్రీడాప్రస్థానం:
2003లో తొలిసారి గ్రాండ్‌స్లాంలో చేరిన నాదల్ 2005లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించి టైటిళ్ళ వేట ప్రారంభించాడు. ఆ తర్వాత 2008 వరకు వరసగా 4 ఫ్రెంచ్ ఓపెన్‌లను సాధించి క్లే కోర్టులలో రాజుగా నిలిచాడు. 2008లోనే వింబుల్డన్ తో పాటు బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణాన్ని కూడా సాధించాడు. ఇదే ఏడాది తొలిసారిగా టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం పొందాడు. 2009లో ఫ్రెంచ్ ఓపెన్ తప్పినప్పటికీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ లభించింది. 2010లో ఫ్రెంచ్, వింబుల్డన్, అమెరికన్ ఓపెన్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను సాధించడమే కాకుండా కెరీర్ గ్రాండ్‌స్లాం సాధించినట్లయింది. 2011లో మూడింటిలో ఫైనల్ చేరినప్పటికీ ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రమే టైటిల్ లభించింది. 2011లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో ఓడి ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం టైటిల్ సాధించాడు. 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు అమెరిక ఓపెన్‌ను రెండోసారి చేజిక్కించుకున్నాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో పరాజయం పొందిననూ ఫ్రెంచ్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 9వ సారి సాధించి క్లేకోర్టులలో తనకు సాటి లేరని నిరూపించాడు. తన కెరీర్‌లో మొత్తం 20 సార్లు గ్రాండ్‌స్లాం ఫైనల్‌కు చేరి 14 సార్లు విజేతగా నిలిచాడు.

విభాగాలు: టెన్నిస్ క్రీడాకారులు, స్పెయిన్ ప్రముఖులు, 1986లో జన్మించినవారు, గ్రాండ్‌స్లాం విజేతలు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక