24, ఆగస్టు 2014, ఆదివారం

కాలరేఖ 1993 (Timeline 1993)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 12: ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్ మరణించారు.
ఆంధ్రప్రదేశ్

భారతదేశము
  • ఫిబ్రవరి 4: ప్రముఖ భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి మరణించారు.
  • ఫిబ్రవరి 9: భారత చదరంగం క్రీడాకారుడు పరమార్జిన్ నేగి జన్మించాడు.
  • నవంబర్ 29: భారత ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా మరణించారు.
ప్రపంచము
  • జనవరి 1: చెకొస్లోవేకియా స్థానంలో స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ రెండు ప్రత్యేక దేశాలుగా ఏర్పడ్డాయి.
  • జనవరి 20: అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
  • జనవరి 26: చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా వాక్లావ్ హావెల్ ఎన్నికయ్యారు.
  • ఫిబ్రవరి 6: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆర్థర్ ఆష్ మరణించాడు.
  • ఫిబ్రవరి 23: బెల్జియం ఆర్థికవేత్త రాబర్ట్ ట్రిఫిన్ మరణించారు.
  • ఫిబ్రవరి 24: బ్రిటీష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బాబీ మూర్ మరణించారు.
  • మార్చి 3:అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త అల్బెర్ట్ సాబిన్ మరణించారు.
  • మార్చి 24: ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఎజర్ వీజ్‌మన్ ఎన్నికయ్యారు.
  • మార్చి 27: చైనా అధ్యక్షుడిగా జియాంగ్ జెమిన్ నియమించబడ్డారు.
  • ఏప్రిల్ 15: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత రాబర్ట్ వెస్తాల్ మరణించారు.
  • మే 24: ఇథియోపియా నుంచి ఎరిత్రియా స్వాతంత్ర్యం పొందినది.
  • జూన్ 14: టర్కీ తొలి మహిళా ప్రధానమంత్రిగా టాన్సు సిల్లర్ నియమించబడింది.
  • జూన్ 19: ఇంగ్లాండుకు చెందిన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత విలియం గోల్డింగ్ మరణించారు.
  • జూన్ 20: జపాన్ లో సంభవించిన భూకంపం వల్ల సుమారు 400 మంది మృతి చెందారు.
  • జూన్ 25: కెనడా తొలి మహిళా ప్రధానమంత్రిగా కిమ్ కాంప్‌బెల్ అధికారం చేపట్టింది.
  • జూలై 7: 19వ G-7 సదస్సు జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభమైంది.
  • ఆగస్టు 9: బెల్జియం రాజుగా రెండో ఆల్బెర్ట్ ప్రమాణ స్వీకారం చేశారు.
  • ఆగస్టు 28: సింగపూర్ అధ్యక్షుడిగా ఓంగ్ టెంగ్ చియాంగ్ ఎన్నికయ్యారు.
  • సెప్టెంబర్ 13: పాలస్తీనా విమోచన నాయకుడు యాసర్ అరాఫత్ మరియు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇత్జక్ రాబిన్ లు వాషింగ్టన్ లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు.
  • సెప్టెంబర్ 17: పోలాండ్ నుంచి రష్యా తన బలాలను ఉపసంహరించుకుంది.
  • అక్టోబర్ 5: చైనా అణుపరీక్షలను నిర్వహించింది.
  • అక్టోబర్ 19: పాకిస్తాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బెనజీర్ భుట్టో ఎన్నికైనది.
  • నవంబర్ 1: యూరోపియన్ యూనియన్ అధికారికంగా అమలులోకి వచ్చింది.
  • నవంబర్ 1: ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సెవెరొ ఓచా మరణించారు.
  • నవంబర్ 11: శ్రీలంక అంతర్యుద్ధంలో 400కు పైగా సైనికులు మరణించారు.
  • నవంబర్ 18: ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార కూటమి తొలి సదస్సు సీటెల్ లో ప్రారంభమైంది.
  • డిసెంబర్ 7: జర్మనీ వైద్యశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఓల్ఫ్‌గాంగ్ పాల్ మరణించారు.
  • డిసెంబర్ 12: హంగేరీ ప్రధానమంత్రిగా పీటర్ బొరొస్ నియమించబడ్డారు.
క్రీడలు
  • ఫిబ్రవరి 26: అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు.
  • ఏప్రిల్ 27: విమానప్రమాదంలో జాంబియా ఫుట్‌బాల్ జట్టు సభ్యులందరూ మరణించారు.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : మజ్రూ సుల్తాన్‌పురి.
  • జ్ఞానపీఠ పురస్కారం : సీతాకాంత్ మహాపాత్ర.
  • టెంపుల్టన్ బహుమతి : చార్లెస్ కొల్సన్.
  • జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఆంగ్ సాన్ సూకీ.
  • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం: (రస్సెల్ అలాన్ హల్జ్, జోసెఫ్ హూటన్ టేలర్), రసాయనశాస్త్రం: (కారి ముల్లిస్, మైకెల్ స్మిత్.) వైద్యశాస్త్రం: (రిచర్డ్ జె రాబర్ట్స్, ఫిలిప్ అలెన్ షార్ప్.) సాహిత్యం: (టోని మారిసన్.) శాంతి: (నెల్సన్ మండేలా, ఫ్రెడరిక్ విలియం డి క్లర్క్.) ఆర్థికశాస్త్రం: (రాబర్ట్ ఫోజెల్, డగ్లస్ సి నార్త్.)
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక