28, సెప్టెంబర్ 2014, ఆదివారం

చేతన్ ఆనంద్ (Chetan Anand)

 చేతన్ ఆనంద్
జననంజూలై 8, 1980
స్వస్థలంవిజయవాడ
రంగంబ్యాడ్మింటన్ క్రీడాకారుడు
సాధించిన విజయాలు4 సార్లు జాతీయ చాంపియన్
బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్ జూలై 8, 1980న విజయవాడలో జన్మించాడు. 4 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను సాధించడమే కాకుండా 2006 కామన్వెల్త్ క్రీడలలో సింగిల్స్‌లో కాంస్యపతకం కూడా సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకు వరకు అధికమించి 2010లో గాయం వల్ల ర్యాంకును దిగజార్చుకున్నాడు. 2006లో అర్జున అవార్డు లభించింది.

క్రీడా ప్రస్థానం:
1992లో పన్నేండేళ్ళ వయస్సులోనే క్రీడా ప్రస్థానం ఆరంభించిన చేతన్ ప్రారంభంలోనే డబుల్స్ విభాగంలో రాణించాడు. 15 ఏళ్ళ వయస్సులోనే జాతీయ సింగిల్స్ విభాగంలో ఫైనల్ వరకు వెళ్ళాడు. చెన్నై జూనియర్ ర్యాంకింగ్ టోర్నీలో తొలిసారిగా టైటిల్ సాధించాడు. అదే స్మాయంలో సీనియర్ విభాగంలో కూడా ప్రవేశించాడు. 1999లో జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌ను 2001లో ఏషియన్ శాటిలైట్ టోర్నీని సాధించాడు. 2004లో తొలిసారిగా జాతీయ సీనియర్ సింగిల్స్ చాంపియన్‌షిప్‌ను సాధించి 2007, 2008 మరియు 2010లలో కూడా గెలిచి మొత్తం 4 సార్లు సింగిల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. 2004లో ఫ్రాన్సులో జరిగిన టౌలౌజ్ ఓపెన్ లో కూడా రాణించి టైటిల్ సాధించాడు. 2009 ఫిబ్రవరిలో తన క్రీడా ప్రస్థానంలో అత్యుత్తమమైన ప్రపంచ 10వ ర్యాంకు సాధించాడు. 2009లో డచ్ గ్రాండ్ ప్రిక్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అదే ఏడాది సయ్యద్ మోడి స్మారక గ్రాండ్ ప్రిక్స్‌లో కూడా టైటిల్ సాధించాడు. 2010లో గాయం వల్ల ర్యాంకు దిగజారింది.

విభాగాలు: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు, విజయవాడ, కృష్ణా జిల్లా ప్రముఖులు, 1980లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక