6, సెప్టెంబర్ 2014, శనివారం

వాసిరెడ్డి సీతాదేవి (Vasireddy Seethadevi)

 వాసిరెడ్డి సీతాదేవి
జననండిసెంబర్ 15, 1933
స్వస్థలంచేబ్రోలు
రంగం రచయిత్రి
మరణంఏప్రిల్ 13, 2007
ప్రముఖ తెలుగు నవలా మరియు కథా రచయిత్రిగా పేరుపొందిన వాసిరెడ్డి సీతాదేవి డిసెంబర్ 15, 1933న గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. చిన్నతనంలోనే చెన్నై చేరుకొని ఐదవ తరగతి వరకు చదువుకొని ప్రైవేటుగా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్యరత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. మరియు ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950) మరియు తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు మరియు 100 పైగా కథలు రచించారు. సీతారెడ్డి ఏప్రిల్ 13, 2007 నాడు మరణించారు.

ఈమె నక్సలిజం గురించి 1982 సంవత్సరంలో రచించిన మరీచిక నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత ఆరుద్ర వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై హైకోర్టు కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన మట్టి మనిషి (2000) నవల 14 భాషలలోకి అనువదించబడినది. ఈమె నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా ప్రజా నాయకుడు, ప్రతీకారం నవలను మనస్సాక్షి సినిమాగా, మానినీ మనసును ఆమె కథ సినిమాలుగా వచ్చాయి. మృగతృష్ణ నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు. ఈమె జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. 1985-1991 మధ్యకాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సేవలందించారు.

అవార్డులు:
ఈమె సాహితీసేవలకుగాను పలు పురస్కారాలు పొందారు. 5 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందగా, 1989లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం  మరియు శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాల  గౌరవ డి.లిట్., 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం పొందినారు.


విభాగాలు: తెలుగు రచయిత్రులు, తెలుగు సాహితీవేత్తలు, గుంటూరు జిల్లా, 1933లో జన్మించినవారు, 2007లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక