6, అక్టోబర్ 2014, సోమవారం

కడప జిల్లా (Kadapa Dist)

 కడప జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం15,379 చకిమీ
జనాభా28,84,524
మండలాలు51
ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలలో కడప జిల్లా ఒకటి. కడప జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు మరియు నాపరాయి బండలకు ప్రసిద్ధి చెందినది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సరిహద్దులేని ఏకైక జిల్లా. పూర్వము ఈ జిల్లాకు హిరణ్యదేశమని పేరు కలదు. ఈ ప్రదేశము పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాము నవాబులచే పరిపాలించబడినది. బ్రిటీష్ కాలంలో మద్రాసు ప్రెసెడెన్సీలో, స్వాతంత్ర్యానంతరం మద్రాసు రాష్ట్రంలో, 1953లో ఆంధ్రరాష్ట్రంలో భాగంగా ఉండి 1956నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది. జిల్లా వైశాల్యం 15,379 చకిమీ, 2011 లెక్కల ప్రకారం జనాభా 28,84,524. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ మండలాలు కలవు. అన్నమయ్య, అల్లసాని పెద్దన, వేమన, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల, శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ జిల్లాకు చెందినవారే. సురభి నాటక సమాజం ప్రస్థానం కడప జిల్లా సురభి గ్రామంలోనే మొదలయ్యింది.కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి, గుంతకల్లు-రేణిగుంట రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
కడప జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోని జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సరిహద్దులేని ఏకైక జిల్లా. ఈ జిల్లాకు తూర్పున నెల్లూరు జిల్లా, దక్షిణాన చిత్తూరు జిల్లా, పశ్చిమాన అనంతపురం జిల్లా, ఉత్తరాన కర్నూలు మరియు ఈశాన్యాన ప్రకాశం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 15,379 చదరపు కిలోమీటర్లు.

రవాణా సౌకర్యాలు:
కర్నూలు నుంచి చిత్తూరు వెళ్ళే జాతీయ రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. గుంతకల్ నుంచి రేణిగుంటకు వెళ్ళు రైలుమార్గం కూడా జిల్లా నుంచి వెళ్ళుచున్నది. మరో కొత్తమార్గం నిర్మాణంలో ఉంది. ప్రధాన పట్టణాలను కలుపుతూ రోడ్డుమార్గాలున్నాయి.

పుష్పగిరి ఆలయం
సందర్శనీయ ప్రదేశాలు:
చారిత్రక ప్రాంతమైన గండికోట, అన్నమాచార్యుని జన్మస్థానం తాళ్ళపాక, బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట శ్రీకోదండస్వామి ఆలయం, పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం, రాయచోటి శ్రీవీరభద్రస్వామి ఆలయం జిల్లాలోని సందర్శనీయ ప్రాంతాలు.

జిల్లా ప్రముఖులు:
ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, ప్రముఖ కవి వేమన, కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, సినీ దర్శకుడు బి.ఎన్.రెడ్డి, సినీనటి శాంతాకుమారి, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన వై.వేణుగోపాల్ రెడ్డి, ఈ జిల్లాకు చెందినవారు.

విభాగాలు: కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక