11, అక్టోబర్ 2014, శనివారం

కైలాస్ సత్యార్థి (Kailash Satyarthi)

 కైలాస్ సత్యార్థి
జననంజనవరి 11, 1954
స్వస్థలంవిదిషా (మధ్యప్రదేశ్)
రంగంబాలల హక్కుల ఉద్యమం
గుర్తింపులు2014 నోబెల్ శాంతి బహుమతి
కైలాస్ సత్యార్థి జనవరి 11, 1954న మధ్యప్రదేశ్‌లోని విదిషాలో జన్మించారు. ప్రారంభంలో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేసి 1980 నుంచి బాలల హక్కులకోసం "బచ్‌పన్ బచావో ఆందోళన్" ఉద్యమాన్ని ప్రారంభించి బాలలహక్కుల ఉద్యమకారుడిగా గణతికెక్కారు. ఆయకకృషికి గాను పలు దేశాలు అవార్డులు అందజేయగా 2014లో ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతిబహుమతికి పాకిస్తాన్‌కు చెందిన బాలిక మలాలా యూసుఫ్ జాయ్‌తో కలిసి సంయుక్తంగా ఎన్నికయ్యారు.

బాల్యం, విద్యాభ్యాసం:
జనవరి 11, 1954న విదిషా జిల్లాలో జన్మించిన కైలాస్ సత్యార్థి సమ్రాట్ అశోక టెక్నొలాజికల్ ఇన్స్‌స్టిట్యూట్ నుంచి విద్యుత్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులై హై-ఓల్టేజ్ ఇంజనీరింగ్‌ విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. కైలాష్ ప్రారంభంలో భోపాల్‌లోని కళాశాలలో అధ్యాపకునిగా కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత బాలల హక్కుల కోసం "బచ్‌పన్ బచావొ ఆందోళన్" ప్రారంభించి దానికి కృషిచేస్తున్నారు.

బచ్‌పన్ బచావొ ఆందోళన్:
1980లో అధ్యాపక వృత్తిని వదికి బానిసత్వ విముక్తి సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అదే సమయంలో బచ్‌పన్ బాచావో ఆందోళన్ ప్రారంభించారు. అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం పోరాడే పలు సంస్థలతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన స్థాపించిన రగ్‌మార్క్ ద్వారా దక్షిణాసియాలో బాలకార్మికులను పనిచేయించుకోని రగ్గుల తయారీ సంస్థలకు సర్టిఫికేషన్ అందజేసే నియంత్రణ సంస్థగా రూపొందింది.

కైలాస్ సత్యార్థి జనరల్ నాలెడ్జి

గుర్తింపులు:
కైలాస్ చేస్తున్న కృషికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు లభించాయి. 1984లో జర్మనీ శాంతి పురస్కారం, 1995లో రాబర్డ్‌ కెనడి మానవ హక్కుల పురస్కారం, 2006లో అమెరికా ప్రభుత్వ స్వేచ్ఛా పురస్కారం, 2007లో ఇటాలియన్‌ సెనేట్‌ పతకం, 2009లో అమెరికా ప్రభుత్వ ప్రజాస్వామ్య పరిరక్షణ పురస్కారం లభించగా 2014లో ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి లభించింది. నోబెల్ శాంతి బహుమతిని పొందిన భారతీయులలో కైలాస్ రెండోవారు. మొత్తంపై నోబెల్ బహుమతి పొందిన ఏడవ భారతీయుడు.


విభాగాలు: నోబెల్ బహుమతి పొందిన భారతీయులు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు, మధ్యప్రదేశ్ ప్రముఖులు, 1954లో జన్మించినవారు,


 = = = = =


4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. నాకు బాగానే కనిపిస్తుంది. బ్రౌజర్‌ను బట్టి కనిపించడంలో తేడాలుండవచ్చు. అయిననూ జికె లింకును కొద్దిగా క్రిందుగా జరిపాను. ఇంకనూ ఏమైన ఇబ్బందులుంటే తెలియజేయండి. సరిచేస్తాను.

      తొలగించండి
  2. ఇలాంటి గొప్ప విషయాలను సోషల్ మీడియా లో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా..! కాస్త ఆలోచించండి

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక