8, నవంబర్ 2014, శనివారం

కృష్ణా జిల్లా (Krishna Dist)

  కృష్ణా జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం8727 చకిమీ
జనాభా45,29,009 (2011),
మండలాలు50
అసెంబ్లీ నియోజకవర్గాలు16
కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా పరిపాలన కేంద్రం మచిలీపట్నం. ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా, నల్గొండ జిల్లాలు మరియు బంగాళాఖాతం ఈ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి. 4 రెవెన్యూ డివిజన్లు, 50 రెవెన్యూ మండలాలు, ఒక నగర పాలక సంస్థ, 5 పురపాలక సంఘాలు, 16 శాసనసభ నియోజకవర్గాలు కలిగిన ఈ జిల్లా 8727 చకిమీ వైశాల్యం మరియు 45.29 లక్షల జనాభాకు కలిగియుంది. కూచిపూడి నాట్యాచార్యుడు సిద్ధేశ్వరయోగి, క్షేత్రయ్య, పింగళి వెంకయ్య, భోగరాజు పట్టాభిసీతారామయ్య, విశ్వనాథ సత్యనారాయణ, ఘంటశాల, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులు ఈ జిల్లాకు చెందిన ప్రముఖులు. 88 కిమీ తీరరేఖ, 5, 9, 221 & 214 నెంబరు జాతీయ రహదారులు, చెన్నై- కోల్‌కత రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నవి. గన్నవరంలో విమానాశ్రయం, మచిలీపట్నంలో ఓడరేవు, ఇబ్రహీంపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్, ఉయ్యూరులో చక్కెర కర్మాగారం ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
కృష్ణా జిల్లా బంగాళాఖాతం తీరాన 15°43' నుంచి 17°10' ఉత్తర అక్షాంశం మరియు 80°00' నుంచి 81°33' తూర్పు రేఖాంశం మధ్యలో విస్తరించియుంది. ఈ జిల్లాకు దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున బంగాళాఖాతం మరియు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమాన గుంటూరు జిల్లా మరియు తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లా, ఉత్తరాన తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

ప్రకాశ బ్యారేజి
చరిత్ర:
కృష్ణానది పేరుమీదుగా ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచించింది ఈ జిల్లాలోనే. మొవ్వ గ్రామములోని కృష్ణుని దేవాలయము చాలా పురాతనమైనది. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఈ జిల్లా ఆ తర్వాత 1953 వరకు మద్రాసు రాష్ట్రంలో కొనసాగింది. 1953లో ఆంధ్రరాష్ట్రంలో, 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మారింది.

విజయవాడ జంక్షన్
రవాణా సౌకర్యాలు:
జిల్లాలో 4 జాతీయ రహదారులు, పలు రైలు మార్గాలు ఉన్నాయి. చెన్నై-కోల్‌కత 5వ బెంబరు జాతీయ రహదారి, పూనా-విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి ముఖ్యమైనవి. ఇవి కాకుండా విజయవాడ నుంచి జగదల్‌పూర్ వరకు ఉన్న 221 నెంబరు జాతీయ రహదారి, కొత్తపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న 214 నెంబరు జాతీయ రహదారి కూడా జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. విజయవాడ సమీపంలోని గన్నవరంలో విమానాశ్రయం ఉండగా, మచిలీపట్నంలో ఓడరేవు ఉంది. రైల్వేలపరంగా విజయవాడ ప్రముఖ రైల్వేజంక్షన్. ఇక్కడి నుంచి నాలుగువైపులా రైలుమార్గాలు కలవు. గుడివాడ కూడా ప్రముఖ రైల్వె జంక్షన్‌గా ఉంది.

నదులు:
కృష్ణా నది ఈ జిల్లాకు చెందిన ప్రధాన నది. ఇది కాకుండా మున్నేరు, తమ్మిలేరు, బుడమేరు నదులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి. విజయవాడ వద్ద కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి నిర్మించబడింది. 

ఎన్టీ రామారావు
రాజకీయాలు:
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు ఈ జిల్లాకు చెందినవారే. తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఇక్కడి ప్రధాన పార్టీలు. 2014లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడగా కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్ పార్టీ ఉనికి చూపింది. 2014 శాసనసభ ఎన్నికలలో 16 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ 10 స్థానాలలో విజయం సాధించగా, వైకాపా 5, భాజపా ఒక స్థానంలో గెలుపొందాయి.

క్రీడలు:
క్రికెట్, కబడ్డి, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇక్కడి ప్రధాన క్రీడలు. క్రికెట్ క్రీడాకారుడు సి.కనకయ్య నాయుడు, చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్, రెజ్లింగ్ క్రీడాకారుడు దండమూడి రాజగోపాల్ అంతర్జాతీయ స్థాయిలో పేరుసంపాదించారు.

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, కృష్ణా జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక