8, డిసెంబర్ 2014, సోమవారం

మిల్కాసింగ్ (Milkha Singh)

మిల్కాసింగ్
జననంనవంబరు 20, 1929
రంగంక్రీడాకారుడు
పతకాలుఆసియా క్రీడలలో 4 స్వర్ణాలు, కామన్వెల్త్ స్వర్ణం,
గుర్తింపులుపద్మశ్రీ
ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారుడైన మిల్కాసింగ్ నవంబరు 20, 1929న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. సైన్యంలో విధులు నిర్వహిస్తూ భారత్ తరఫున ప్రముఖ అథ్లెటిక్స్‌లో రాణించాడు. కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా, ఒలింపిక్స్‌లో ఫైనల్స్ చేరిన తొలి అథ్లెటిక్స్ క్రీడాకారుడిగా పేరుపొందారు. ఆసియా క్రీడలలో 4 స్వర్ణాలు సాధించారు. మిల్కాసింగ్ సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.

క్రీడా ప్రస్థానం:
1958లో కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం సాధించి భారత్ తరఫున అథ్లెటిక్స్‌లో కామన్వెల్త్ క్రీడలలో తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా అవతరించాడు. 2014 కామన్వెల్త్ క్రీడలలో వికాస్‌గౌడ్ (డిస్కర్ థ్రో) బంగారు పతకం సాధించే వరకు ఏకైక పురుష అథ్లెట్ క్రీడాకారుడిగా నిలిచారు. 1958, 1962లలో జరిగిన టోక్యో, జకర్తా ఆసియా క్రీడలలో రెండేసి స్వర్ణాలు సాధించారు. 1964లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో అప్పటి ఒలింపిక్ రికార్డును కూడా అధికమించిననూ తృటిలో పతకం చేజారి 4వ స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్‌లో ఒక ఈవెంట్‌లో భారతీయుడు ఫైనల్స్ చేరడం అదే తొలిసారి. 40 సంవత్సరాల పాటు మిల్కాసింగ్ టైమింగ్ జాతీయ రికార్డుగా కొనసాగింది.

కుటుంబం:
మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కూడా క్రీడాకారిణిగా పేరుపొందింది. ఈమె భారత మహిళా వాలీబాల్ జట్టుకు నాయకత్వం వహించింది. మిల్కాసింగ్ కుమారుడు జీవ్ మిల్కాసింగ్ ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు.

విభాగాలు: భారత అథ్లెటిక్స్ క్రీడాకారులు, పంజాబ్ క్రీడాకారులు, ఆసియా క్రీడలలో స్వర్ణపతకం సాధించిన భారతీయులు, కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణపతకం సాధించిన భారతీయులు, 1929లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక