30, జనవరి 2015, శుక్రవారం

సుభాష్ ఘీసింగ్ (Subhash Ghisingh)

సుభాష్ ఘీసింగ్
జననంజూన్ 22, 1936
రంగంగూర్ఖాల హక్కుల కోసం పోరాటం
మరణంజనవరి 29, 2015
గూర్ఖాల హక్కుల కోసం, ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం పోరాడిన సుభాష్ ఘీసింగ్ జూన్ 22, 1936న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా మిరిక్‌లో జన్మించారు. ప్రారంభంలో నీలోఝండా సంస్థను స్థాపించి ఆ తర్వాత నేపాలీ భాష మాట్లాడే వారికోసం ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండుతో ఉద్యమం లేవదీశారు. గూర్ఖాలాండ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్‌ చైర్మెన్‌గా వ్యవహరిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పాటుకు కారకులయ్యారు. దీనికి 20 సంవత్సరాలు చైర్మెన్‌గా వ్యవహరించారు. సుభాష్ ఘీసింగ్ జనవరి 29, 2015న మరణించారు.

ఉద్యమ ప్రస్థానం:
1968లో నీలోఝండా సంస్థను స్థాపించి గూర్ఖాల హక్కుల కోసం పోరాడారు. 1979లో ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించి 1980లో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పాటుచేశారు.
1986-88 కాలంలో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమ పోరాటం హింసాత్మకంగా మారి దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పాయారు. గూర్ఖా నేషనల్ ల్బరేషన్ ఫ్రంట్‌కు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతోనూ, కేంద్ర ప్రభుత్వం తోనూ పలుసార్లు ప్రత్యేక చర్చలు జరిగిన ఫలితంగా 1988లో డార్జిలింగ్ గూర్ఖాహిల్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థకు 2008 వరకు సుభాష్ ఘీసింగ్ చైర్మెన్‌గా వ్యవహరించారు.

సుభాష్ ఘీసింగ్ జనరల్ నాలెడ్జి
సుభాష్ ఘీసింగ్‌తో విభేధించి DGHCకు పోటీగా బిమల్ గురంద్ నేతృత్వంలో  గూర్ఖా జన్‌ముక్తి మోర్చా ఏర్పాటు కావడంతో ఘీసింగ్ ప్రాధాన్యత తగ్గింది. 2011 పశ్చిమబెంగాల్ ఎన్నికలలో కూడా ఘీసింగ్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

విభాగాలు: పశ్చిమబెంగాల్ ప్రముఖులు, డార్జిలింగ్, 1936లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక