2, ఫిబ్రవరి 2015, సోమవారం

పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)

 పశ్చిమ గోదావరి జిల్లా
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వైశాల్యం7,742 చకిమీ
జనాభా39,34,782 (2011)
మండలాలు48
పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా రాజధాని ఏలూరు. జిల్లాకు తూర్పున గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాను జిల్లా నుండి వేరు చేస్తున్నది. 5వ నెంబరు జాతీయ రహదారి మరియు చెన్నై- కోల్‌కత రైలుమార్గం జిల్లా గుండా వెళ్ళుచున్నాయి. జిల్లాకు దక్షిణాన బంగాళాఖాతం, ప.గో-కృష్ణా జిల్లా సరిహద్దులో కొల్లేరు సరస్సు ఉన్నాయి. ఏలూరు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం జిల్లాలోని ప్రముఖ పట్టణాలు కాగా ద్వారకా తిరుమల, భీమారామం, క్షీరారామం ప్రముఖ క్షేత్రాలు. జిల్లాలో 48 మండలాలు, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కలవు. జిల్లా వైశాల్యం 7,742 చకిమీ, 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 39,34,782.

భౌగోళికం, సరిహద్దులు:
పశ్చిమ గోదావరి జిల్లాకు తూర్పున తూర్పు గోదావరి జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన కృష్ణా జిల్లా, ఉత్తరాన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తూ తూర్పు గోదావరి జిల్లాతో వేరుచేస్తున్నది. జిల్లా వైశాల్యం 7,742 చదరపు కిలోమీటర్లు.

గుంటిపల్లి గుహలు
చరిత్ర:
ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం నంద సామ్రాజ్యంలోనూ, తరువాత అశోకుని మౌర్య సామ్రాజ్యంలోనూ, తరువాత శాతవాహనుల, గుప్తుల ఏలుబడిలోకి వచ్చింది. మాఠర వంశం వారు క్రీ.శ. 375 నుండి 500 వరకు ఆంధ్ర తీర ప్రాంతాన్ని పరిపాలించారు. తరువాత రెండు శతాబ్దాలు పిఠాపురం కేంద్రంగా విష్ణు కుండినులు ఈ తీర ప్రాంతంలో రాజ్యపాలన చేశారు. ఆ తరువాత బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్య పాలన మొదలయ్యింది. వారి పాలనలో రాజధాని పిఠాపురం నుండి వేంగి, తరువాత రాజమహేంద్రవరంకు మార్చబడింది. బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. తరువాత 1942 లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. బ్రిటీష్ కాలంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం 1953లో ఆంధ్రరాష్ట్రంలో, 1956లో ఆంధ్రప్రదేశ్‌లో చేరింది.

కొల్లేరు సరస్సు
పర్యాటకం:
కృష్ణా జిల్లా సరిహద్దులో ప్రముఖమైన కొల్లేరు సరస్సు ఉంది. ఏలూరు సమీపాన "చిన్న తిరుపతి"గా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల, పోలవరం సమీపంలో ఉన్న పాపి కొండలు ముఖ్యమైన పర్యాటక ప్రాంత్రాలు. గుంటుపల్లిలో ప్రాచీనమైన బౌద్ధారామాలు ఉన్నాయి. పంచారామాలలో భీమారామం, క్షీరారామం జిల్లా పరిధిలో ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 39,34,782. ఇది దేశంలోని 640 జిల్లాలలో 61వ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 508. 2001-11 దశాబ్దిలో జనాభా పెరుగుదల రేటు 3.45%. స్త్రీ-పురుష్ నిష్పత్తి వెయ్యి పురుషులకు 1004 మహిళలు. అక్షరాస్యత శాతం 74.32%.


విభాగాలు: ఆంధ్రప్రదేశ్ జిల్లా వ్యాసాలు, పశ్చిమ గోదావరి జిల్లా,


 = = = = =


Tags: West Godavari District in Telug, About West Godavari Dist in Telugu, west godavari dist information, west godavari dist essay,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక