19, ఏప్రిల్ 2015, ఆదివారం

తెలంగాణ ఉద్యోగుల వేతన స్థిరీకరణ - 2015 (Telangana Employees Revised Pay - 2015)

తెలంగాణ ఉద్యోగుల వేతన స్థిరీకరణ 2015
2010 స్కేలులో వేతనంXXXX
01-07-2013 నాటికి కరువు భత్యం63.344%
ఫిట్‌మెంట్ బెనిఫిట్43%
మొత్తంXXXX
తదుపరి స్టేజీXXXX
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు ఉద్యోగుల వేతన స్థిరీకరణకై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ప్రదీప్ కుమార్ అగర్వాల్ అధ్యక్షతన 10వ పే రివిజన్ కమీషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. మే 29, 2014నాడు ఈ కమీషన్ రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. రాష్ట్ర విభజన అనంతరం చివరికి మార్చి 18, 2015 నాడు తెలంగాణ ప్రభుత్వం G.O.Ms.No.25 Finance (HRM IV) Dept తేది 18-03-2015 ప్రకారం ఉత్తర్వు విడుదల చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వులోని ముఖ్యాంశాలు:

  • మాస్టర్ స్కేలు భావనను యధాతధం చేసింది.
  • తేది 01-07-2013 నాటికి ఉన్న కరువు భత్యం రేటు 63.344% ను వేతనంలో కలపబడుతుంది.
  • మాస్టర్ స్కేలులో 32 గ్రేడులు, 80 స్టేజీలు ఉంచబడింది.
  • ఫిట్‌మెంట్ బెనిఫిట్ 43% గా నిర్ణయించబడింది. ఇది 10వ వేతన కమీషన్ సిఫార్సు చేసిన 29% కంటే అధికంగా ఉంది.
  • మాస్టర్ స్కేలు 13000లతో ప్రారంభమై 110850తో ముగుస్తుంది.
  • ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్‌ ఇదివరకు ఉన్నట్లుగానే 6, 12, 18, 24 సంవత్సరాలకు వర్తిస్తుంది.
  • 01-07-2013 నుంచి 01-06-2014 వరకు పెరిగిన భత్యాలు నోషనల్‌గా, 02-06-2014 నుంచి 28-02-2015 వరకు జీపీఎఫ్‌లో మరియు 01-03-2015 నుంచి నగదుగా అందజేయబడుతుంది.
  • 01-06-2014 వరకు పొందిన ఐఆర్ (తాత్కాలిక భృతి) ఉద్యోగుల నుంచి వసూలు చేయబడదు. ఆ తర్వాత పొందినది మాత్రం కొత్త వేతనంలో సర్దుబాటు చేయబడుతుంది.
  • స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇదివరకు ఉన్నట్లుగానే 5 ఉంటాయి.
  • ఉద్యోగులు 01-07-2013 కాని లేదా 30-06-2014లోపు తదుపరి ఇంక్రిమెంటు తేదికి కాని ఆప్షన్ ఇవ్వవచ్చు.
మాస్టర్ స్కేలు:
రూ.13000 - 390 - 14170 - 430 - 15460 - 470 - 16870 - 510 - 18400 - 550 - 20050 - 590 - 21820 - 640 - 23740 - 700 - 25840 - 760 - 28120 - 820 - 30580 - 880 - 33220 - 950 - 36070 - 1030 - 39160 - 1110 - 42490 - 1190 - 46060 - 1270 - 49870 - 1360 - 53950 - 1460 - 58330 - 1560 - 63010 - 1660 - 67990 - 1760 - 73270 - 1880 - 78910 - 2020 - 84970 - 2160 - 91450 - 2330 - 100770 - 2520 -110850 (80 స్టేజీలు).
ఇంటి అద్దె భత్యం:
ప్రభుత్వ ఉత్తర్వు సంయ 27 తేది 18-03-2015 ప్రకారం గ్రేటర్ హైదరాబాదు (GHMC) పరిధిలో ఇదివరకు ఉన్నట్లుగా 30% HRA కొత్త వేతనంలో కూడా లభిస్తుంది. కరింనగర్, ఖమ్మం, నిజామాబాదు, రామగుండం, వరంగల్‌ నగరపాలక సంస్థలతో పాటు మహబూబ్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని వారికి 20% (2011 ప్రకారం 2 లక్షల జనాభా దాటిన నగరాలు), ఆదిలాబాదు, కాగజ్‌నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిస్తాల, కూరుట్ల, మెట్‌పల్లి, సిద్ధిపేట్, జహీరాబాదు, సంగారెడ్డి, వికారాబాదు, తాండూరు, వనపర్తి, గద్వాల, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, బోధన్, జనగామ, పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల పరిధిలో (2011 జనాభా ప్రకారం 50వేలు మించిన 27 పట్టణాలు) HRA 14.5% లభిస్తుంది. మిగితా వారికి 12% లభిస్తుంది.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలంగాణ ఉద్యోగుల సమచారం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక