13, ఏప్రిల్ 2015, సోమవారం

షబ్బీర్ అలీ (Shabbir Ali)

షబ్బీర్ అలీ
జననంఫిబ్రవరి 15, 1957
పదవులురాష్ట్ర మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,
నిజామాబాదు జిల్లాకు చెందిన షబ్బీర్ అలీ ఫిబ్రవరి 15, 1957న కామారెడ్డి పట్టణంలో జన్మించారు. కామర్స్ పట్టభద్రుడైన షబ్బీర్ అలీ కళాశాల దశలోనే NSUIలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారు. శాసనసభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం:
కళాశాల దశలోనే NSUI తరఫున ఉద్యమాలు చేపట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తగా మారి 1989లో తొలిసారి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే సమయంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉర్దూ, మైనార్టీ శాఖ మంత్రిపదవి పొందారు. 1994, 1999లలో పరాజయం పొందినారు. 2004లో రెండోసారి శాసనసభకు ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో కొనసాగారు. 2009లో తెలుగుదేశం పార్టీకి చెందిన గంపగోవర్థన్ చేతిలో 47వేల తేడాతో భారీ పరాజయం పొందారు. 2010 ఉప ఎన్నికలలో ఎన్నికలలో పోటీచేసి మళ్ళీ ఓడిపోయారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికై, 2014లో శాసనసభ స్థానానికి పోటీచేసిననూ విజయం లభించలేదు. 2015 మార్చిలో తెలంగాణ శాసనమండలి విపక్షనేతగా ఎంపికయ్యారు.

విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ శాసనమండలి సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక