29, ఏప్రిల్ 2015, బుధవారం

సురినాం (Suriname)

ఖండందక్షిణ అమెరికా
రాజధానిపరమారిబో
వైశాల్యం1,63,821 చకిమీ
జనాభ5,73,311
సురినాం దక్షిణ అమెరికాకు చెందిన దేశము. ఇది దక్షిణ అమెరికాలో ఈశాన్యం వైపున అట్లాంటిక్ మహాసముద్రం తీరాన ఉంది. దేశవైశాల్యం 1,63,821 చకిమీ, జనాభా 5,73,311. దేశ రాజధాని పరమారిబో, అధికార భాష డచ్చి. దేశంలో హిందువులు అధికసంఖ్యలో ఉన్నారు. నవంబరు 25, 1975న సురినాం స్వాతంత్ర్యం పొందింది. దక్షిణ అమెరికలో ఇది అతిచిన్న సార్వభౌమదేశం. బాక్సైట్ ఖనిజానికి ఈ దేశం ప్రసిద్ధి.

భౌగోళికం, సరిహద్దులు:
సురినాం దేశం దక్షిణ అమెరికాలో 1° నుంచి 6° ఉత్తర అక్షాంశం, 54° నుంచి 58° పశ్చిమ అక్షాంశం మధ్యలో విస్తరించియుంది. దేశ వైశాల్యం 1,63,821 చదరపు కిలోమీటర్లు. ఈ దేశానికి ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణన బ్రెజిల్, తూర్పున ఫ్రెంచ్ గినియా, పశ్చిమాన గుయానాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2012 గణాంకాల ప్రకారం సురినాం జనాభా 541,638. ఇందులో 27% భారతీయ సంతతివారు. 19వ శతాబ్దిలో కార్మికులుగా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. జనాభాలో 48% క్రిస్టియన్లు, 22% హిందువులున్నారు. 60% ప్రజలు డచ్చి భాష మాట్లాడూతారు. దేశంలో పెద్ద నగరం పరిమారిబో. ఇది దేశ జనాభాలో 40%పైగా కలిగియుంది.

అధ్యక్ష భవనం
చరిత్ర:
ఈ ప్రాంతం క్రీ.శ.17వ శతాబ్దిలో ఆంగ్ల, డచ్చి వారి అధీనంలో ఊండేది. డచ్చివారు ఈ ప్రాంతాన్ని డచ్ గుయానాగా పేరుపెట్టి 1954 వరకు పాలించారు. ఆ తర్వాత డచ్ రాజ్యాంగ దేశంగా ఉండి 1975లో స్వాతంత్ర్యం పొందింది. 1980లో దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది.

క్రీడలు:
సురినాం ప్రధాన క్రీడ ఫిట్‌బాల్. ఆంథోని నిస్టి స్విమ్మింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించాడు. క్రికెట్ కూడా కొంతభాగంలో ప్రజాదరణ పొందింది.


విభాగాలు: ప్రపంచ దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు, 


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక