5, మే 2015, మంగళవారం

ఆకాశ్ క్షిపణి (Akash Missile)

క్షిపణి రకంభూమి నుంచి ఆకాశం
గరిష్ట ఎత్తు18 కిమీ
ప్రవేశపెట్టిన దినంమే 5, 2015
ఆకాశ్ క్షిపణి భారతదేశం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి క్షిపణి. ఇది భూమి నుంచి ఆకాశంలోని శతృదేశాల యుద్ధవిమానాలను లక్ష్యంగా చేసుకొని ఎదుర్కొంటుంది. మధ్యతరహా శ్రేణికి చెందిన ఈ క్షిపణిని DRDO, ఆర్డినన్స్ కర్మాగారం, భారత్ ఎలక్టానిక్స్ లు రూపొందించాయి. 30 కిలోమీటర్ల సమీప లక్ష్యాలను గరిష్టంగా 18 కిలోమీటర్లను ఈ క్షిపణి సమర్థంగా ఎదుర్కొంటుంది. మే 5, 2015 నాడు ఈ క్షిపణిని భారత సైన్యంలో ప్రవేశపెట్టారు. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాల వద్ద ఈ రకం క్షిపణి లేదు.

సుమారు రూ.600 కోట్ల వ్యయంతో, 18 సంవత్సరాల పరిశోధన అనంతరం రూపొందించిన ఈ క్షిపణి భారత రక్షణశాఖ అమ్ములపొదిలో అత్యంత అధునాతనమైన క్షిపణి. 5500 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ క్షిపణి తయారీలో భాగస్వాములైనారు. అధికారికంగా భారతసైన్యంలో ప్రవేశపెట్టడానికి ముందు ఈ క్షిపణిని పలుసార్లు విజయవంతంగా ప్రయోగించి పరిశీలించారు. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కేవలం 35 సెకన్లలో ఛేధించడం ఈ క్షిపణి ప్రత్యేకత. ఒకేదఫా 4 లక్ష్యాలపై 8 క్షిపణులు ప్రయోగించడానికి వీలుంది. ఈ క్షిపణిని ఎక్కడికైనా తరలించడానికి కూడా సులభంగా లాంచింగ్ పాడ్ ఉంది.

విభాగాలు: భారతదేశ రక్షణ వ్యవస్థ,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక