13, మే 2015, బుధవారం

బూదరాజు రాధాకృష్ణ (Budaraju Radhakrishna)

జననంమే 3, 1932
స్వస్థలంవేటపాలెం
రంగంభాషావేత్త, పాత్రికేయుడు,
మరణంజూన్ 4, 2006
ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడుగా పేరుపొందిన బూదరాజు రాధాకృష్ణ మే 3, 1932న ఇప్పటి ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించారు. పాఠశాల విద్య స్థానికంగా వేటపాలెంలో పూర్తిచేసి "హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్‌స్క్రి ప్షన్" అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా అందుకున్నారు.

1953 నుంచి 1968 వరకు చీరాలలోని ఒక కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై 1968-73 కాలంలో తెలుగు అకాడమీ రీసెర్చి ఆఫీసర్‌గా, 1973--88 వరకు తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసారు. పిదప రెండేళ్ళు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్‌గా, 1990 నుంచి దశాబ్దం పాటు ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాలుగా పనిచేసారు.

రాధాకృష్ణ పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. ఈనాడు పత్రికలో పుణ్యభూమి శీర్షికకు ధర్మారావు కలంపేరుతో వందలాది వ్యాసాలు వ్రాసారు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించారు.

2006 జూన్ 4న బూదరాజు రాధాకృష్ణ మరణించారు. "సదా స్మరామి" అన్న పుస్తకం ఆయన మరణానంతరం ఆయన స్మృతి సంచికగా ఆయన శిష్య బృందం విడుదల చేసింది.

విభాగాలు: తెలుగు రచయితలు, భాషావేత్తలు, ప్రకాశం జిల్లా ప్రముఖులు, 1932లో జన్మించినవారు, 2006లో మరణించినవారు,


 = = = = =


1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక