13, మే 2015, బుధవారం

చోళ లింగయ్య (Chola Lingaiah)

చోళ లింగయ్య
జననంజూన్ 13, 1913
స్వస్థలంమెదక్
రంగంహైదరాబాదు విమోచనోద్యమం,
తెలంగాణ విమోచన పోరాటయోధునిగా పేరుపొందిన చోళ లింగయ్య జూన్ 13, 1913న మెదక్ పట్టణంలో జన్మించారు. పాఠశాల దశలోనే విద్యార్థి సంఘాలను ఏర్పాటుచేశారు. గాంధీ-నెహ్రూ చిత్రపటాలను అవిష్కరించినందుకు పాఠశాల నుంచి బహిష్కృతులైనారు. 1942లో భారత వైమానికదళంలో చేరారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్‌లో పనిచేసిన చోళ లింగయ్య సుభాష్ చంద్రబోస్ పిలుపును అందుకొని ఉద్యోగానికి రాజీనామా చేశారు. బోస్ మరణం (భావిస్తున్న) తర్వాత హైదరబాదుకు వచ్చి తెలంగాణ విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

1947, ఆగస్టు 15న మెదక్ పట్టణంలోని పటేల్ కుంటలో జాతీయజెండాను ఆవిష్కరించిన పిదప అరెస్ట్ వారెంట్ జారీకావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళారు. నిజాం సర్కారు లింగయ్యను 1947 సెప్టెంబరు 10న అరెస్ట్ చేసి 7 నెలల పాటు హైదరాబాదులోని చంచల్‌గూడ జైలులో ఉంచింది. విమోచన అనంతరం లింగయ్య హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులుగా, ఆలిండియా కాంగ్రెస్ డెలిగేట్‌గా, 1977లో మెదక్ జిల్లా పార్టీ కోశాధికారిగా పనిచేశారు. లింగయ్య చిన్న కుమారుడు చోళ రాంచరణ్ యాదవ్ కూడా రాజకీయాలలో రాణిస్తున్నారు.

విభాగాలు: మెదక్ జిల్లా సమరయోధులు, మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, మెదక్ పట్టణం, 1913లో జన్మించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక