22, ఆగస్టు 2015, శనివారం

కెన్నెత్ ఆరో (Kenneth Arrow)

జననంఆగస్టు 23, 1921
రంగంఆర్థికవేత్త
గుర్తింపులుఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి (1972)
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయిన కెన్నెత్ ఆరో ఆగస్టు 23, 1921న న్యూయార్క్ నగరంలో జన్మించాడు. న్యూయార్క్ సిటీ కళాశాలలో గణితశాస్త్రం లో 1940 లో డిగ్రీ పొంది, ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం లో గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని, 1950లో అర్థశాస్త్రంలో పి.హెచ్.డి.నీ పొందినాడు. తదనంతరం చికాగో, స్టాన్ఫిర్డ్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేశాడు. అర్థశాస్త్రంలో సాధారణ సమతౌల్య సిద్ధాంతం మరియు సంక్షేమ సిద్ధాంతాలపై రచనలు చేసినందుకు 1972 లో బ్రిటీష్ ఆర్థికవేత్త జాన్ హిక్స్ తో కల్సి సంయుక్తంగా అర్థశాస్త్రపు నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాలకు, పంపిణీకి, వినియోగానికి కల సంబంధాన్ని అతను సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో వివరించినాడు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేసి గరిష్ట సంక్షేమం పొందాలనేది కూడా ఇతను వివరించినాడు. ఇతని యొక్క సంక్షేమ సిద్ధాంతం ఆరో సిద్ధాంతం గా ప్రసిద్ధి చెందింది. గణితశాస్త్రంలో అతనికి కల పరిజ్ఞానంతో గణిత సూత్రాలతో అర్థశాస్త్ర సిద్ధాంతాలు రచించి ఆ తర్వాతి ఆర్థికవేత్తలకు మార్గదర్శకుడిగా నిల్చినాడు.

విభాగాలు: అమెరికా ప్రముఖులు, ఆర్థికవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, 1921లో జన్మించినవారు,, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక