29, జులై 2016, శుక్రవారం

పి.వి.పరబ్రహ్మశాస్త్రి (P.V.Parabrahma Shastry)

పి.వి.పరబ్రహ్మశాస్త్రి
జననం1921
రంగంచరిత్రకారుడు
మరణంజూలై 27, 2016
ప్రముఖ చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన పీవీ పరబ్రహ్మ శాస్త్రి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో 1921లో జన్మించారు. పురావస్తు శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి 1981 పదవీ విరమణ పొందిన పరబ్రహ్మశాస్త్రి వందలాది శాసనాలను బయటకు తీశారు. వందల సంఖ్యలో రచనలు చేశారు. బయ్యారం చెరువు శాసనం ఆధారంగా కాకతీయుల వంశాక్రమణిక, కోటిలింగాల త్రవ్వకాల ఆధారంగా శాతవాహన వంశ కాలనిర్ణయం చేశారు.

ఆయన విద్యాభ్యాసం అంతా గుంటూరు జిల్లాలోనే సాగింది. 1948లో బనారస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. 1951-59 కాలంలో వరంగల్ జిల్లా జనగామలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1959 నుంచి రాష్ట్ర పురావస్తు శాఖలో వివిధ హోదాలలో పనిచేసి 1977లో డిప్యూటి డైరెక్టర్‌గా రిటైర్ అయ్యారు. 94 సంవత్సరాల వయస్సులో జూలై 27, 2016న మరణించారు.


విభాగాలు: 1921లో జన్మించినవారు, 2016లో మరణించినవారు, చరిత్రకారులు, తెలంగాణ ప్రముఖులు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక