మాక్స్ ప్లాంక్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఏప్రిల్ 23, 1858న కీల్‌లో జన్మించిన మాక్స్ ప్లాంక్ భౌతికశాస్త్రంలో కీలకమైన క్వాంటం సిద్ధాంతాన్ని కనుగొని 1918లో నోబెల్ బహుమతి పొందాడు. 17 సం.ల వయస్సులోనే ప్రయోగాలు చేసి, 31వ ఏట బెర్లిన్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు. 89 సం.ల వయస్సులో అక్టోబర్ 4,1947న మరణించాడు.
క్వాంటం సిద్ధాంతం: శక్తి అవిచ్ఛిన్నంగా కాకుండా విడివిడిగా అతి చిన్న పరిమాణాల్లో కణాల రూపంలో ఉంటుంది. ఈ పరిమాణాన్ని క్వాంటమ్ శక్తి అంటారు. ఇది ఆవర్తన పట్టికను విపులీకరిస్తుంది. రసాయనిక చర్యలు ఎందుకు జరుగుతాయో వివరిస్తుంది. జీవశాస్త్రంలో డీఎన్‌ఏ కణాల స్థిరత్వాన్ని, పరమాణు కేంద్రం నుంచి ఆల్ఫా కణాల వికిరణాలను వివరిస్తుంది. లేజర్ కిరణాలు, కంప్యూటర్ రంగానికి మూలాధారమైన మైక్రోచిప్స్, అతివాహకత, కాంపాక్ట్ డిస్క్ ల ఆవిష్కరణకు ఈ సిద్ధాంతం నాంది పలికింది.
= = = = =
|
Tags: Famous Scientists in Telugu, Alexander Fleming in Telugu, Nobel Prize winners in Telugu, World Famous Persons in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి