2, అక్టోబర్ 2017, సోమవారం

పూడూరు మండలం (Pudur Mandal)

జిల్లా వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్వికారాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంపరిగి
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
పూడూరు మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజన్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. అక్టోబరు 11, 2016 వరకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో భాగమైంది. మండలంలోని మన్నెగూడ గ్రామం మామిడిపండ్లకు ప్రసిద్ధి. దామగుండంలో ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. మండలంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం వికారాబాదు జిల్లాలో తూర్పు వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన మరియు వాయువ్యాన వికారాబాదు మండలం, పశ్చిమాన పరిగి మండలం, తూర్పున మరియు దక్షిణాన రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41319. ఇందులో పురుషులు 20914, మహిళలు 20405. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43625. ఇందులో పురుషులు 21998, మహిళలు 21627. అక్షరాస్యుల సంఖ్య 24169.

రాజకీయాలు:
ఈ మండలం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన మల్లేశం ఎన్నికయ్యారు.

మండలంలోని గ్రామాలు:
అంగడిచిట్లంపల్లి (Angadichittampalli), బాకాపూర్ (Bakapur), చంగోముల్ (Changomul), చీలాపూర్ (Cheelapur), చింతలపల్లి (Chintalapalli), గంగుపల్లి (Gangupalli), ఘట్‌పల్లి (Ghatpalli), కండ్లపల్లి (Kandlapalli), కంకల్ (Kankal), కెర్వెల్లి (Kervelli), కోడ్మూర్ (Kodmoor), కొత్తపల్లి (Kothapalli), మంచన్‌పల్లి (Manchanpalli), మన్నెగూడ పైగా (Manneguda Paigah), మన్నెగూడ సారెకాస్ (Manneguda Sarecas), మేడొకొండ (Medikonda), మేడిపల్లి కలాన్ (Medipalle Kalan), మీర్జాపూర్ (Mirzapur), మిట్టకంకల్ (Mittakankal), నిజాంపేట్ మేడిపల్లి (Nizamppet Medipalli), పెద్ద ఉమంతల్ (Peddaumanthal), పోతిరెడ్డిగూడ (Pothireddiguda), పుడ్గుర్తి (Pudgurthy), పూడూర్ (Pudur), కుతుబుల్లాపూర్ (Quthbullapur), రాకంచెర్ల (Rakamcherla), రేగడిమామిడిపల్లి (Regadimamidipalli), సిర్గాయిపల్లి (Sirgaipalle), సోమన్‌గుర్తి (Somangurthy), తిమ్మాపూర్ (Thimmapur), తిప్పాపూర్ (Thippapur), తిర్మలాపూర్ (Thirmalapur), తుర్క ఎన్కేపల్లి (Turkayenkepalli), ఎన్కేపల్లి (Yenkepalli)

ప్రముఖ గ్రామాలు:
దామగుండం (Damagundam):
దామగుండం వికారాబాదు జిల్లా పూడూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ రామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది.
మన్నెగూడ (Manneguda):
మన్నెగూడ వికారాబాదు జిల్లా పూడూరు మండలమునకు చెందిన గ్రామము. హైదరాబాదు-బీజాపుర్ అంతర్రాష్ట్ర రహదారి గ్రామం నుంచి వెళ్లడమే కాకుండా ఇక్కడి నుంచే వికారాబాదు వెళ్ళు రహదారి కూడా ప్రారంభమౌతుంది. మన్నెగూడ మామిడిపండ్లకు ప్రసిద్ధి. ఇక్కడి ఎర్రనేలలు మామిడిపండ్ల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. ప్రక్కరాష్ట్రాలకే కాకుండా గల్ఫ్ దేశాలకు కూడా ఇక్కడి నుంచి మామిడిపండ్లు ఎగుమతి అవుతాయి.
రాకమచర్ల (Rakamacharma):
రాకమచర్ల వికారాబాదు జిల్లా పూడూరు మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం ఒకప్పుడు మామిడిపండ్లకు ప్రసిద్ధి. నిజాం నవాబులు కూడా ఇక్కడి మామిడిపండ్లను ఇష్టపడేవారు.



హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు, వికారాబాదు రెవెన్యూ డివిజన్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, పూడూరు మండలము, 


 = = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of statistics, Rangareddy Dist, 2007-08
  • Census Statistics, Rangareddy Dist, 2011
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు (G.O.Ms.No.) 248 తేది 11-10-2016

Tags: Vikarabad Dist Mandals in Telugu, Vikarabad District Mandals information in Telugu, Telangana Mandals,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక