అఫ్ఘనిస్తాన్ ఆసియా ఖండానికి చెందిన భూపరివేష్ఠిత దేశము. భౌగోళికంగా ఈ దేశం మధ్య ఆసియా దేశంగాను, మధ్యప్రాచ్య దేశంగాను, లేదా దక్షిణ ఆసియా దేశంగాను పిల్వడం జరుగుతుంది. ఈ దేశానికి దక్షిణాన మరియు తూర్పు న పాకిస్తాన్, పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు తజికిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. దేశంలో అధిక భాగం పర్వతప్రాంతంగా ఉంది. దేశ రాజధాని కాబూల్, కరెన్సీ అఫ్ఘానీ. దేశ వైశాల్యం 652,864 చకిమీ, జనాభా 3.46 కోట్లు. క్రికెట్ మరియు ఫుట్‌బాల్ ఇక్కడి జనాదరణ పొందిన క్రీడలు.
చరిత్ర:
క్రీ.పూ. 2000-1200 మధ్య ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో నివసించినట్లు భావిస్తున్నారు. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పర్షియన్ సామ్రాజ్యం నెలకొన్నది. క్రీ.పూ. 330లో అలెగ్జాండర్ దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు.ఆ తర్వాత మౌర్యులు పాలించారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో కుషానులు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషానులను ఓడించిసస్సనిద్‌లు క్రీ.శ. మూడవ శతాబ్దంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. 1219 లో చెంగీజ్ ఖాన్ నాయకత్వంలో మంగోలులు ఆఫ్ఘనిస్తాన్‌ను, తామర్లేన్ (తైమూర్ లంగ్)ను జయించి విశాలమైన రాజ్యాన్ని నెలకొల్పారు. 15వ శతాబ్దిలో మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. 1739లో నాదిర్షా కాందహార్‌ను వశపర్చుకున్నాడు. 19వ శతాబ్దిలో బ్రిటీష్ వారికి అఫ్ఘన్లకు మధ్యన ఆంగ్లో-అఫ్ఘన్ యుద్ధాలు జరిగాయి. అప్పుడు బ్రిటీష్ ఇండియా మరియు అఫ్ఘనిస్తాన్ మధ్యన డ్యూరాండ్ రేఖ సరిహద్దుగా నిర్ణయించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో సోవియట్ సైనికులు అఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించడంతో లక్షలాది మంరి దేశం వదిలి వెళ్ళారు. 1989లో సోవియట్ సేనలు వెనుదిరిగాయి. 2001లో అమెరికాపై ఉగ్రదాడి జరగడంతో అల్‌ఖైదా తీవ్రవాదుల ఏరివేతకై అమెరికా సేనలు అఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించాయి. లాడెన్ హత్య తర్వాత 2011లో అఫ్ఘనిస్తాన్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: Afghanistan in Telugu, Kabul, Kandaharm Herat, Pashto Durrani Empire ,Afghani currency, Buddhas of Bamiyan Ahmad Shah Durrani Father of the Nation Zahir Shah, the last king of Afghanistan Mohammad Najibullah, President of Afghanistan from 1987 to 1992 Pashtun Sunni Islam Lapis lazuli stones
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి