17, మార్చి 2019, ఆదివారం

మనోహర్ పారికర్ (Manohar Parrikar)

జననండిసెంబరు 13, 1955
పదవులుగోవా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి
పార్టీభాజపా
మరణంమార్చి 17, 2019
కేంద్రమంత్రిగా, గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ డిసెంబరు 13, 1955న గోవాలోని మపుసాలో జన్మించారు. ముంబాయి ఐఐటి నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన పారికర్ గోవా శాసనసభకు ఎన్నికై ఐఐటి డిగ్రీతో ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా అవతరించారు. ఆ తర్వాత గోవా మంత్రిగా, కేంద్రంలో నరేంద్రమోడి మంత్రివర్గంలోనూ పనిచేసి 2017లో గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మార్చి 17, 2019న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
ప్రారంభం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఉన్న పారికర్ 1994లో తొలిసారి భాజపా తరఫున గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు. 2000లో తొలిసారిగా గోవా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 2005 వరకు పనిచేశారు. 2014లో నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యాక పారికర్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. 2017లో గోవా శాసనసభ ఎన్నికలలో భాజపాకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో సమర్థుడైన పారికర్‌ను ముఖ్యమంత్రి పదవి చేపట్టుటకై మళ్ళీ రాష్ట్రానికి పంపించారు. మార్చి 2018 నుంచి ఆరోగ్య సమస్యలపై పలుసారు ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. మార్చి 17, 2019న పాంక్రియాటిక్ కాన్సర్ వ్యాధితో మరణించారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: ముఖ్యమంత్రులు, గోవా, 2019లో మరణించిన ప్రముఖులు


 = = = = =


Manohar Parikar, Goa CM Parikar

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక