భారతదేశానికి చెందిన ప్రముఖ హాకీ క్రీడాకారుడిగా పేరుపొందిన ధ్యాన్ చంద్ ఆగస్టు 29, 1905న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాదులో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. ఈయన అసలుపేరు ధ్యాన్ సింగ్. లైట్లు లేని కాలంలో హాకీ శిక్షణకై రాత్రిసమయాలలో చంద్రుని వెలుతుకై ఎదురు చూసి సహచరులచే చాంద్ పేరుతో పిల్వబడి చివరికి అది పేరులో భాగమైంది.
ప్రారంభంలో ధ్యాచ్‌చంద్ బ్రిటీష్ ఇండియా ఆర్మీలో చేరి మేజర్ ర్యాంక్ పొందారు. ఆర్మీలో ఉన్నప్పుడే హాకీ లో రాటుదేలి 1928, 1932, 1936లలో భారత హాకీ జట్టులో స్థానం పొందాడు. ఈ 3 ఒలింపిక్స్‌లలో భారత్ స్వర్ణం సాధించుటలో ధ్యాన్‌చం కీలకపాత్ర పోషించాడు. భారతదేశపు హాకీ మాంత్రికుడిగా పేరుపొందిన ఈయన 1926-49 కాలంలో 185 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 570 గోల్స్ సాధించాడు. తన ఆత్మకథను "గోల్" పేరిట గ్రంథస్తం చేసిన చాంద్ డిసెంబరు 3, 1979న ఢిల్లీలో మరణించాడు. ఈయన భారత క్రీడారంగానికి చేసిన సేవలకుగాను 1956లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం పొందారు. ఆయన జన్మదినమైన ఆగస్టు 29ను జాతీయ క్రీడాదినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతిచే పలు క్రీడా అవార్డులు ఈ రోజున ప్రధానం చేయబడతాయి. 1980లో ధ్యాన్‌చంద్ ముఖచిత్రంతో తపాలాబిళ్ళ విడుదల చేయబడింది. 2002 నుంచి ధ్యాన్ చంద్ పేరిట అత్యుత్తమ క్రీడాకారులకు లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ప్రధానం చేస్తున్నారు. 2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకు ధ్యాన్‌చంద్ స్టేడియంగా నామకరణం చేయబడింది. 2014లో ధ్యాన్‌చంద్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. చివరికి ఈ పురస్కారం సీఎన్నార్ రావుతో పాటు సచిన్ టెండుల్కర్‌కు లభించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
26, మే 2020, మంగళవారం
ధ్యాన్‌చంద్ (Dhyan Chand)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి