|
|
నిర్వహించిన పదవులు | రాష్ట్ర మంత్రి |
నియోజకవర్గం | మహబూబ్ నగర్ |
జన్మించిన తేది | జూలై 23, 1946 |
మరణించిన తేది | డిసెంబరు 11, 2009 |
పులి వీరన్న పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పులి వీరన్న 1946, జూలై 23న దేవరకద్రలో జన్మించారు. న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించి, ఆ తర్వాత రాజకీయాలలో చేరి కోడంగల్ నుంచి 4 సార్లు పోటీచేసి పరాజయం పొందినారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి 3 సార్లు పోటీచేసి 2 సార్లు విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినారు.
రాజకీయ జీవనం
న్యాయశాస్త్రం విద్య అభ్యసించిన పులివీరన్న 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో భాగంగా రెండు సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళారు. తొలిసారిగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1972లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మరో 3 సార్లు పరాజయం పొందిన పిదప 1989లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చేనేత జౌళి శాఖామంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికలలో మళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని ఆశించిననూ పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించడంతో కాంగ్రెస్ రెబెల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009 ఎన్నికలలో పులివీరన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిననూ తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. డిసెంబరు 11, 2009న మరణించారు. పులివీరన్న భార్య పులి అంజనమ్మ 2006-11 కాలంలో మహబూబ్ నగర్ పురపాలక సంఘపు వైస్ చైర్మెన్‌గా పనిచేశారు.

= = = = =
సంప్రదించిన గ్రంథాలు, పత్రికలు, వెబ్ సైట్లు:- Puliveranna.com.
- మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ నాయకులు, దేవరకద్ర మండలము, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి