28, జనవరి 2013, సోమవారం

మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం (Mahabubnagar Loksabha Constituency)

మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం
(పసుపురంగులో ఉన్నది)
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. అంతకు క్రితం ఉన్న ఆలంపూర్, గద్వాల, వనపర్తి నియోజకవర్గాలు నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో కల్పబడింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భాగమైనాయి.
ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు (రామేశ్వరరావు మరియు మల్లికార్జున్) నాలుగేసిసార్లు విజయం సాధించడమే కాకుండా ఇద్దరూ 3 వరస విజయాలతో హాట్రిక్ కూడా సాధించారు. మొత్తంపై ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించగా, తెరాస 2సార్లు, టీపీఎస్, జనతాపార్టీ, జనతాదళ్, బిజెపిలు చెరోసారి విజయం సాధించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన జితేందర్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
నియోజకవర్గ చరిత్ర:
1952లో ఇది ద్విసభ్యనియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ వారే ఎన్నికయ్యారు. 1957లో వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఇక్కడి నుంచి ఎన్నికై పార్లమెంటులో ప్రవేశించారు. ఆ తర్వాత 1962లో జె.బి.ముత్యాలరావు గెలుపొందినారు. 1967, 71, 77 లలో వరసగా మూడుసార్లు రామేశ్వర్ రావు ఎన్నికయ్యారు. ఇతను 1967, 77లలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికవగా, 1971లో మాత్రం తెలంగాణ ప్రజాపార్టీ తరఫున విజయం సాధించారు. 1980లో మల్లికార్జున్ విజయం సాధించారు. 1984లో ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న సూదిని జైపాల్ రెడ్డి జనతాపార్టీ తరఫున గెలుపొందినారు. 1989, 91, 96లలో వరసగా 3 సార్లి మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1999లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన దేవరకొండ విఠల్‌రావు విజయం సాధించగా, 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక్కడి నుంచి గెలుపొందినారు. 2014లో తెరాస అభ్యర్థి జితేందర్ రెడ్డి గెలుపొందారు.

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 పి.రామస్వామి
కె.జనార్ధనరెడ్డి
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ


1957 జె.రామేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ

1962 జె.బి.ముత్యాలరావు కాంగ్రెస్ పార్టీ

1967 జె.రామేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ

1971 జె.రామేశ్వర్ రావు టీపీఎస్

1977 జె.రామేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ

1980 మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ

1984 ఎస్.జైపాల్ రెడ్డి జనతాపార్టి

1989 మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ

1991 మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ

1996 మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ

1998 ఎస్.జైపాల్ రెడ్డి జనతాదళ్

1999 ఏపీ జితేందర్ రెడ్డి బిజెపి

2004 డి.విఠల్ రావు కాంగ్రెస్ పార్టీ

2009 కె.చంద్రశేఖర్ రావు టీ.ఆర్.ఎస్.

2014 జితేందర్ రెడ్డి టీ.ఆర్.ఎస్.


1996 ఎన్నికలు:
1996లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మల్లికార్జున్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.కె.అరుణపై 4502 ఓట్ల స్వల్ప మెజారిటితో విజయం సాధించి 6వ సారి లోకసభలో ప్రవేశించారు. మల్లికార్జున్‌కు 2,59,875 ఓట్లు రాగా, అరుణకు 2,54,377 ఓట్లు, భాజపా అభ్యర్థి రావుల రవీంద్రనాథ్ రెడ్డికి 1,25,952 ఓట్లు, ఎన్తీఆర్ తెలుగుదేశం (లక్ష్మీపార్వతి) అభ్యర్థి జితేందర్ రెడ్డికి 53,594 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన దేవరకొండ విఠల్ రావుపై 20184 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కెసీఆర్‌కు 366569 ఓట్లు రాగా, విఠల్‌రావుకు 346385 ఓట్లు లభించాయి. భాజపా అభ్యర్థి కె.యదగిరిరెడ్డి 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 17 అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఒక నామినేషన్ తిరస్కరించబడింది. 7గురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 9 అభ్యర్థులు మిగిలారు. తెరాసకు చెందిన జితేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన జైపాల్ రెడ్డిపై 2590 ఓత్ల స్వల్ప మెజారిటితో విజయం సాధించి రెండోసారి లోకసభలో ప్రవేశించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా నియోజకవర్గాలు, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోకసభ నియోజకవర్గాలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక