మాడ్గుల్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలోని అందుగుల ప్రాంతంలో క్రీ.పూ.1000-600 నాటి చారిత్రక ఆనవాళ్ళు, సమాధులు లభించాయి. కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. ఈ మండలము ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43136.మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామపంచాయతీలు కలవు.
2016 అక్టోబరు 11 నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో భాగమైంది. సరిహద్దులు: ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఆగ్నేయ భాగంలో నల్గొండ జిల్లా మరియు నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఉత్తరమున మరియు తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున నాగర్‌కర్నూల్ జిల్లా, పశ్చిమాన ఆమనగల్ మండలం, కడ్తాల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 43136. ఇందులో పురుషులు 22138, మహిళలు 20998. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 48939. ఇందులో పురుషులు 25125, మహిళలు 23814. జనాభాలో ఇది జిల్లాలో 53వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: ఆమనగల్ నుంచి మండల కేంద్రానికి రహదారి సౌకర్యం ఉంది. రాజకీయాలు: ఈ మండలము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరేకంటి నారాయణ, 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రమావత్ చావ్లి ఎన్నికయ్యారు.కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, చేవెళ్ళ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు.
2008-09 నాటికి మండలంలో 50 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 9 ప్రాథమికోన్నత పాఠశాలలు (7 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 10 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 9 జడ్పీ) 1 ప్రైవేట్ జూనియర్ కళాశాలల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 30257 హెక్టార్లలో 43% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి. వరి, కందులు, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 580 మిమీ. మండలంలో సుమారు 1900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. cccc
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Madgul Mandal in Telugu, rangareddy Dist mandals information in telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి